కాగ్నిజెంట్‌లో 23,000 మంది ఫ్రెషర్ల నియామకం

ABN , First Publish Date - 2020-12-10T06:43:51+05:30 IST

ప్రాంగణ నియామకాల ద్వారా వచ్చే ఏడాది 23,000 మంది ఫ్రెషర్లను కంపెనీలో చేర్చుకోనున్నట్లు కాగ్నిజెంట్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌ చైర్మన్‌, ఎండీ రాజేశ్‌ నంబియార్‌ తెలిపారు.

కాగ్నిజెంట్‌లో 23,000 మంది ఫ్రెషర్ల నియామకం

న్యూఢిల్లీ: ప్రాంగణ నియామకాల ద్వారా వచ్చే ఏడాది 23,000 మంది ఫ్రెషర్లను కంపెనీలో చేర్చుకోనున్నట్లు కాగ్నిజెంట్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌ చైర్మన్‌, ఎండీ రాజేశ్‌ నంబియార్‌ తెలిపారు. యూనివర్సిటీలు, ఇతర విద్యా సంస్థల నుంచి ఇంజనీరింగ్‌, సైన్స్‌, మేనేజ్‌మెంట్‌ గ్రాడ్యుయేట్లను నియమించుకునే విషయంలో కాగ్నిజెంట్‌ టాప్‌ రిక్రూటర్‌గా కొనసాగనుందని ఆయన పేర్కొన్నారు.


ఈ ఏడాది యూనివర్సిటీ క్యాంప్‌సల నుంచి 17,000 మంది ఫ్రెషర్లను ఉద్యోగంలో చేర్చుకున్నట్లు ఆయన చెప్పారు. అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న కాగ్నిజెంట్‌ సిబ్బందిలో 70 శాతం మంది భారత కార్యాలయాల్లోనే పనిచేస్తున్నారు. 


Updated Date - 2020-12-10T06:43:51+05:30 IST