2,200 మంది ఉద్యోగులు ఇంటికి : కోకాకోలా
ABN , First Publish Date - 2020-12-19T06:05:09+05:30 IST
కొవిడ్ దెబ్బతో ప్రముఖ శీతల పానీయాల సంస్థ కోకాకోలా ఖర్చులు తగ్గించుకునే పనిలో పడింది. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 2,200

అట్లాంటా: కొవిడ్ దెబ్బతో ప్రముఖ శీతల పానీయాల సంస్థ కోకాకోలా ఖర్చులు తగ్గించుకునే పనిలో పడింది. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 2,200 మంది ఉద్యోగుల్ని తగ్గించుకోవాలని నిర్ణయించింది. ఇందులో సగం మంది అమెరికాలోనే ఉంటారని తెలిపింది. వ్యాపార పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ఈ చర్య చేపట్టినట్టు పేర్కొంది. ఖర్చులు తగ్గించుకునే చర్యల్లో భాగంగా కంపెనీ ఇప్పటికే తన బ్రాండ్లను సగానికి తగ్గించుకుంది. వ్యాపార విభాగాలను 17 నుంచి 9కి కుదించింది. ఉద్యోగుల తొలగింపు ప్రభావం భారత్‌లోని కంపెనీ సొంత బాట్లింగ్ యూనిట్లపైనా ఉంటుందని భావిస్తున్నారు.