పునరుత్పాదక ఇంధన రంగాల్లోకి కోల్ ఇండియా...
ABN , First Publish Date - 2020-12-28T01:46:42+05:30 IST
కోల్ ఇండియా లిమిటెడ్(సీఐఎల్)... ప్రపంచంలోనే అతి పెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థ... ఇకపై ఇతర(మైనింగేతర) వ్యాపారాల్లోకి ప్రవేశించనుంది. వచ్చే(2021) ఏడాదిలో... క్లీన్ టెక్నలాజీలో పెట్టుబడులకు సీఐఎల్ ఆసక్తి చూపుతోంది.

న్యూఢిల్లీ : కోల్ ఇండియా లిమిటెడ్(సీఐఎల్)... ప్రపంచంలోనే అతి పెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థ... ఇకపై ఇతర(మైనింగేతర) వ్యాపారాల్లోకి ప్రవేశించనుంది. వచ్చే(2021) ఏడాదిలో... క్లీన్ టెక్నలాజీలో పెట్టుబడులకు సీఐఎల్ ఆసక్తి చూపుతోంది. ఈ క్రమంలో... అల్యూమినియం, క్లీన్ కోల్ టెక్నలాజీ, పునరుత్పాదన ఇంధన రంగాల్లో పెట్టుబడులు పెట్టనుందని బొగ్గు శాఖ కార్యదర్శి అనీల్ కుమర్ జైన్ వెల్లడించారు. ఇక... 2023-24 లో కోల్ ఇండియా లక్ష కోట్ల టన్నుల ఉత్పత్తి సామర్థ్యానికి చేరనుంది. కాగా బొగ్గు ఉత్పత్తిలో మాదిరిగానే... అల్యూమినియం, క్లీన్ కోల్ టెక్నలాజీ, పునరుత్పాదన ఇంధన రంగాల్లో కూడా సీఐఎల్ రికార్డులను సృష్టిస్తుందని కేంద్రప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి.