కరోనా వ్యాక్సిన్‌ తయారీ కోసం సిప్లాతో సీఎస్‌ఐఆర్‌-ఐఐసీటీ జట్టు

ABN , First Publish Date - 2020-03-19T07:19:13+05:30 IST

కరోనా వ్యాక్సిన్‌ తయారీ కోసం సిప్లాతో సీఎస్‌ఐఆర్‌-ఐఐసీటీ జట్టు

కరోనా వ్యాక్సిన్‌ తయారీ కోసం సిప్లాతో సీఎస్‌ఐఆర్‌-ఐఐసీటీ జట్టు

హైదరాబాద్‌: కరోనా వ్యాక్సిన్‌ తయారీ కోసం ప్రముఖ ఔషధ సంస్థ సిప్లాతో హైదరాబాద్‌కు చెందిన సీఎ్‌సఐఆర్‌-ఐఐసీటీ జట్టుకట్టింది. యాంటీ వైరల్‌ ఔషధాలపై ప్రపంచవ్యాప్తంగా చాలాకాలంగా పరిశోధనలు జరుగుతున్నాయని, పలు కంపెనీలు యాంటీ వైరల్‌ ప్రాపర్టీ్‌సతో కూడిన అణువుల(మాలిక్యూల్‌)ను కూడా అభివృద్ధి చేశాయని ఐఐసీటీ వర్గాలన్నాయి. అయినప్పటికీ, సీఎ్‌సఐఆర్‌-ఐఐసీటీ మూ డు మాలిక్యూల్స్‌ (రెమెడి్‌సవిర్‌, ఫెవీపిరావిర్‌, బాలోక్సావిర్‌)పై పరిశోధనలు చేయాలని నిర్ణయించుకుందన్నారు. తక్షణమే ఈ మాలిక్యూల్స్‌పై పరిశోధనలు ప్రారంభించాలని ఐఐసీటీ డైరెక్టర్‌ ఎస్‌ చంద్రశేఖర్‌ను సిప్లా కోరింది. 

Updated Date - 2020-03-19T07:19:13+05:30 IST