సిగ్నిటీ లాభం రూ.29 కోట్లు

ABN , First Publish Date - 2020-05-08T07:06:34+05:30 IST

గత ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన సిగ్నిటీ టెక్నాలజీస్‌ రూ.29.26 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది క్రితం ఇదే కాలం లాభం...

సిగ్నిటీ లాభం రూ.29 కోట్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): గత ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన సిగ్నిటీ టెక్నాలజీస్‌ రూ.29.26 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.29.88 కోట్లతో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. సమీక్ష త్రైమాసికానికి కార్యకలాపాల ద్వారా లభించిన ఆదాయం రూ.206.44 కోట్ల నుంచి రూ.233.04 కోట్లకు పెరిగిందని కంపెనీ వెల్లడించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో లభించిన మొత్తం ఆదాయంలో 20.2 శాతం ఆదాయం మొదటి ఐదు పెద్ద ఖాతాదారుల నుంచే లభించిందని సిగ్నిటీ సీఎండీ సీవీ సుబ్రమణ్యం తెలిపారు.  


Updated Date - 2020-05-08T07:06:34+05:30 IST