దిగ్గజ కంపెనీలపై చైనా పట్టు

ABN , First Publish Date - 2020-12-25T06:34:39+05:30 IST

చైనా తన దేశంలోని దిగ్గజ కంపెనీల గురించి భయపడుతోందా? ఆ కంపెనీల నుంచి చైనా కమ్యూనిస్టు పార్టీ (సీసీపీ)కి ము ప్పు ఉందని భయపడుతోందా? ప్రస్తుతం చైనా లో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అలాగే అనిపిస్తోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

దిగ్గజ కంపెనీలపై చైనా పట్టు

‘గుత్తాధిపత్యం’ పేరుతో నియంత్రణ 

ఆలీబాబా గ్రూప్‌పై దర్యాప్తు


బీజింగ్‌: చైనా తన దేశంలోని దిగ్గజ కంపెనీల గురించి భయపడుతోందా? ఆ కంపెనీల నుంచి చైనా కమ్యూనిస్టు పార్టీ (సీసీపీ)కి ము ప్పు ఉందని భయపడుతోందా? ప్రస్తుతం చైనా లో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అలాగే అనిపిస్తోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ-కామర్స్‌ దిగ్గజం ‘ఆలీబాబా గ్రూ ప్‌’పై గుత్తాధిపత్య ఆరోపణల పేరుతో దర్యా ప్తు, ఆ సంస్థ అనుబంధ సంస్థ ‘యాంట్‌ గ్రూ ప్‌ భారీ పబ్లిక్‌ ఇష్యూకు బ్రేక్‌ వేయడం, ఇంకో టెక్‌ దిగ్గజం టెన్సెంట్‌ హోల్డింగ్‌పై భారీ జరిమానా.. ఇందులో భాగమని విశ్లేషకుల అంచ నా. మారుతున్న వ్యాపార స్వరూపాలకు అనుగుణంగా, రెగ్యులేటరీ సంస్థలు మారకపోవడంతో వ్యాపార అవకాశాలు సన్నగిల్లుతున్నాయని అక్టోబరులో జరిగిన ఒక సదస్సులో చైనాలో అత్యంత సంపన్నుడైన ఆలీబాబా గ్రూప్‌ అధినేత జాక్‌ మా విమర్శించారు. సీసీపీ సభ్యుడు కూడా అయిన జాక్‌ మా ఇలా విమర్శించడం అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ ప్రభుత్వానికి కోపం తెప్పించిందని విశ్లేషకుల అంచనా. 


అంతా ప్రభుత్వ కనుసన్నల్లోనే: చైనాలో ప్రస్తుతం అధ్యక్షుడు జిన్‌పింగ్‌ తిరుగులేని నేత. పార్టీ నుంచి లేదా సైన్యం నుంచి జిన్‌పింగ్‌కు ఎలాంటి ముప్పు లేదు. అయితే ఆలీబాబా, టెన్సెంట్‌ వంటి దిగ్గజ కంపెనీలను నియంత్రించక పోతే మున్ముందు అవి ప్రభుత్వానికి ముప్పుగా మారే ప్రమాదం ఉందని జిన్‌పింగ్‌ ప్రభు త్వం భయపడుతోంది. ఈ కారణంతోనే రెగ్యులేటరీ సంస్థల ద్వారా ఆ సంస్థలపై పట్టు బిగిస్తోంది. 


ఇవీ ఆరోపణలు:  ఆలీబాబా వంటి కంపెనీలు గుత్తాధిపత్యంతో పోటీని చం పేస్తున్నాయని చైనా రెగ్యులేటరీ సంస్థల ఆరోపణ. ఈ పేరుతోనే ఆలీబాబాపై గురువారం దర్యాప్తునకు ఆదేశించింది. చైనాలో అత్యంత ప్రజాదరణ ఉన్న ‘వియ్‌చాట్‌’ మెసేజింగ్‌ యాప్‌ కంపెనీ టెన్సెంట్‌పైనా చైనా ఇప్పటికే కొరడా ఝుళిపించింది. నిబంధనలను తుంగలో తొక్కి, రెగ్యులేటరీ సంస్థల ముందస్తు ఆమోదం లేకుండా ఈ టెక్‌ దిగ్గజం కొన్ని కంపెనీలను కొనుగోలు చేసిందనేది ఆరోపణ. ఈ ఆరోపణలతో ఆ కంపెనీపై భారీగా జరిమానా విధించారు. మరోవైపు వచ్చే ఏడాది కంపెనీల గుత్తాధిపత్యాన్ని నియంత్రించడమే ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని ఇటీవల సీసీపీ పత్రిక ‘పీపుల్స్‌ డెయిలీ’ పేర్కొంది.

Updated Date - 2020-12-25T06:34:39+05:30 IST