‘బయోలాజికల్ ఈ’కి సీఈపీఐ నిధులు
ABN , First Publish Date - 2020-12-30T06:41:17+05:30 IST
హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఈ (బీఈ) కంపెనీ కొవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధి, తయారీకి కొలిషన్ ఫర్ ఎపిడిమిక్ ప్రిపేర్‌డ్‌నెస్ ఇన్నోవేషన్స్ (

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఈ (బీఈ) కంపెనీ కొవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధి, తయారీకి కొలిషన్ ఫర్ ఎపిడిమిక్ ప్రిపేర్‌డ్‌నెస్ ఇన్నోవేషన్స్ (సీఈపీఐ) 50 లక్షల డాలర్ల (దాదాపు రూ.36 కోట్లు) వరకూ నిధులు అందించనుంది. ఈ మేరకు రెండు సంస్థలు సహకార ఒప్పందం కుదుర్చుకున్నాయి. వ్యాక్సిన్ తయారీ ప్రక్రియకు అయ్యే వ్యయాలకు ఈ నిధులను వినియోగిస్తారు.
2021లో 10 కోట్ల డోసుల తయారీ స్థాయికి చేరడానికి బీఈకి మరిన్ని నిధులు ఇచ్చే అంశాన్ని కూడా సీఈపీఐ పరిశీలిస్తుంది. డైనావ్యాక్స్ టెక్నాలజీస్ కార్పొరేషన్, బేలార్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌తో కలిసి బీఈ కొవిడ్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది. నవంబరులో ఈ వ్యాక్సిన్‌పై మొద టి, రెండో దశ క్లినికల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి.