గుంటూరులో సెలెక్ట్ 75వ స్టోర్
ABN , First Publish Date - 2020-10-24T07:18:03+05:30 IST
మొబైల్ ఫోన్లను విక్రయిస్తున్న సెలెక్ట్ గుంటూరులోని బ్రాడీపేటలో 75వ స్టోర్‌ను ప్రారంభించింది. దాదాపు 3,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో గుంటూరులోనే పెద్ద స్టోర్‌ను ప్రారంభించామని సెలెక్స్ సీఎండీ వై గురు తెలిపారు...

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): మొబైల్ ఫోన్లను విక్రయిస్తున్న సెలెక్ట్ గుంటూరులోని బ్రాడీపేటలో 75వ స్టోర్‌ను ప్రారంభించింది. దాదాపు 3,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో గుంటూరులోనే పెద్ద స్టోర్‌ను ప్రారంభించామని సెలెక్స్ సీఎండీ వై గురు తెలిపారు. రెండేళ్లలోనే తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రలో మొత్తం 75 స్టోర్లను ఏర్పాటు చేశామని, త్వరలో ఈ సంఖ్య 100 స్టోర్లకు చేరగలదని చెప్పారు. దసరా, దీపావళి సందర్భంగా మొబైల్ ఫోన్ల కొనుగోలుపై ఆకర్షణీయ ఆఫర్లు ఇస్తున్నట్లు సెలెక్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మురళి రేతినేని తెలిపారు. ఆన్లైన్ కంటే తక్కువ ధరలకు మొబైల్ ఫోన్లను ఆఫర్ చేస్తున్నాం. రూ.4,999 నుంచి ఎల్ఈడీ టీవీలు అందుబాటులో ఉన్నాయి. మొబైల్ యాక్ససరీలపై 70 శాతం, హెల్త్ ప్రొడక్ట్‌లపై 50 శాతం వరకు డిస్కౌంట్లు ఇస్తున్నట్లు గురు తెలిపారు.