సీబీడీటీ రీఫండింగ్ వేగవంతం... 59.68 లక్షలమందికి రూ. 1.40 లక్షల కోట్లు చెల్లింపు...

ABN , First Publish Date - 2020-12-03T20:19:16+05:30 IST

కరోనా నేపథ్యంలో... పన్ను చెల్లింపుదారులకు ఇబ్బంది కలగకుండా సీబీడీటీ(సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్)... పన్ను రీఫండ్‌ను వేగవంతం చేసింది. ప్రతీఏడు మాదిరిగానే... ఈసారి కూడా పన్ను చెల్లింపుదారులకు రీఫండ్ చేసింది.

సీబీడీటీ రీఫండింగ్ వేగవంతం... 59.68 లక్షలమందికి రూ. 1.40 లక్షల కోట్లు చెల్లింపు...

న్యూఢిల్లీ : కరోనా నేపథ్యంలో... పన్ను చెల్లింపుదారులకు ఇబ్బంది కలగకుండా సీబీడీటీ(సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్)... పన్ను రీఫండ్‌ను వేగవంతం చేసింది. ప్రతీఏడు మాదిరిగానే... ఈసారి కూడా పన్ను చెల్లింపుదారులకు రీఫండ్ చేసింది. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది... ఏప్రిల్  ఒకటి నుండి డిసెంబర్ ఒకటి వరకు మొత్తం రూ. 1,40,210 కోట్లను పన్ను చెల్లింపుదారులకు రీఫండ్ జరిగింది. ఆదాయపు పన్ను శాఖ ఈ వివరాలను వెల్లడించింది. 


కాగా... ఇందులో పర్సనల్ ఇన్‌కం ట్యాక్స్ (పీఐటీ) రీఫండ్ రూ. 38,105 కోట్లు కాగా, కార్పోరేట్ ట్యాక్స్ రీఫండ్ రూ. 1,02 లక్షల కోట్లు. మొత్తం 59.68 లక్షల మంది పన్ను చెల్లింపుదారులున్నారు. ఇందులో 57,68,926 పర్సనల్ ఇన్‌కం ట్యాక్స్ పేయర్లు, మరో 1,99,165 మంది కార్పోరేట్ ట్యాక్స్ పేయర్స్‌కు చెల్లింపులు జరిగాయి. 


Updated Date - 2020-12-03T20:19:16+05:30 IST