కెనరాబ్యాంకు నిర్వహణ లాభం రూ.2041 కోట్లు
ABN , First Publish Date - 2020-06-25T06:14:07+05:30 IST
కెనరాబ్యాంకు మార్చి 31తో ముగిసిన నాలుగో త్రైమాసికంలో రూ.2041 కోట్ల నిర్వహణా లాభం నమోదు చేసింది. ఏడాది మొత్తానికి ఇది రూ.9,360 కోట్లు. కాని నాలుగో త్రైమాసికంలో రూ.3,259.33 కోట్లు...

బెంగళూరు (ఆంధ్రజ్యోతి): కెనరాబ్యాంకు మార్చి 31తో ముగిసిన నాలుగో త్రైమాసికంలో రూ.2041 కోట్ల నిర్వహణా లాభం నమోదు చేసింది. ఏడాది మొత్తానికి ఇది రూ.9,360 కోట్లు. కాని నాలుగో త్రైమాసికంలో రూ.3,259.33 కోట్లు, ఏడాది మొత్తానికి రూ.2236 కోట్లు నికర నష్టం మాత్రం నమోదు చేయక తప్పలేదు.
మొండి బకాయిల కోసం రూ.5375.38 కోట్లు కేటాయించడంతో నష్టం భరించక తప్పలేదని బ్యాంకు తెలిపింది. బ్యాంకు మొత్తం ఆదాయం 1.6 శాతం పెరిగి రూ.14,422 కోట్లకు చేరినట్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం.వి.రావు తెలిపారు. సిండికేట్ బ్యాంకు విలీనంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఉమ్మడి ఫలితాలు మెరుగ్గా ఉండగలవన్న ఆశాభావం ఆయన ప్రకటించారు. బ్యాంకు మొత్తం ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా 4.4 శాతం వృద్ధితో రూ.10,28,348 కోట్లకు చేరగా అంతర్జాతీయంగా 3.2 శాతం వృద్ధితో రూ.10,76,574 కోట్లకు చేరింది. ఏడాది మొత్తానికి నిర్వహణా లాభం రూ.9,360 కోట్లు కాగా నికర ఎన్‌పిఎలు 4.22 శాతానికి తగ్గాయి.