లాక్‌డౌన్‌లో బీఎస్ఎన్ఎల్ బంపరాఫర్

ABN , First Publish Date - 2020-03-31T00:50:35+05:30 IST

లాక్‌డౌన్ కారణంగా ఇంటిపట్టునే ఉంటున్న బీఎస్ఎన్ఎల్ ఖాతాదారులకు ఇది శుభవార్తే. గతవారం

లాక్‌డౌన్‌లో బీఎస్ఎన్ఎల్ బంపరాఫర్

న్యూఢిల్లీ: లాక్‌డౌన్ కారణంగా ఇంటిపట్టునే ఉంటున్న బీఎస్ఎన్ఎల్ ఖాతాదారులకు ఇది శుభవార్తే. గతవారం కాలపరిమితి ముగిసిన ఖాతాదారులకు ఏప్రిల్ 20 వరకు వ్యాలిడిటీని పొడిగిస్తూ బీఎస్ఎన్ఎల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇది పూర్తిగా ఉచితమని పేర్కొంది. వినియోగదారులు ఇన్‌కమింగ్ కాల్స్ అందుకునేందుకే కాలపరిమితిని పొడిగించినట్టు వివరించింది. దీంతోపాటు జీరో బ్యాలెన్స్‌కు చేరుకున్న వినియోగదారులకు ఉచితంగా పది రూపాయల విలువైన టాక్‌టైంను కూడా అందిస్తున్నట్టు తెలిపింది. అత్యవసర సమయంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొంది.


ప్రస్తుత సంక్షోభం నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ తమ ఖాతాదారులకు అండగా ఉంటుందని ఆ సంస్థ సీఎండీ ప్రవీణ్ కుమార్ పూర్వార్ తెలిపారు. వినియోగదారులు తమ ఖాతాలను రీచార్జ్ చేసుకునేందుకు ‘మై బీఎస్ఎన్ఎల్ యాప్’, బీఎస్ఎన్ఎల్ వెబ్‌సైట్‌తోపాటు ఇతర పాపులర్ వ్యాలెట్లను ఉపయోగించుకోవాలని కోరారు. 


లాక్‌డౌన్ నేపథ్యంలో వలసదారుల ప్రయోజనార్థం కాల్స్ ఉచితంగా చేసుకునే సదుపాయం కల్పించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆదివారం రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్, ఎయిర్‌టెల్ వంటి టెలికం కంపెనీలను కోరుతూ లేఖ రాసింది. నెల రోజులపాటు ఉచితంగా ఔట్ గోయింగ్, ఇన్‌కమింగ్ కాల్స్‌కు అనుమతి ఇవ్వాల్సిందిగా ఆ లేఖలో కోరినట్టు ప్రియాంక గాంధీ తెలిపారు. స్పందించిన బీఎస్ఎన్ఎల్ వ్యాలిడిటీని వచ్చే నెల 20 వరకు పెంచినట్టు ప్రకటించింది.

Updated Date - 2020-03-31T00:50:35+05:30 IST