అడ్వాన్స్ ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్లను ప్రకటించిన బీఎస్ఎన్ఎల్

ABN , First Publish Date - 2020-07-11T00:55:51+05:30 IST

భారత ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ తమ ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం పలు రీచార్జ్

అడ్వాన్స్ ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్లను ప్రకటించిన బీఎస్ఎన్ఎల్

న్యూఢిల్లీ: భారత ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ తమ ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం పలు రీచార్జ్ ప్యాక్‌లను విడుదల చేసింది. ప్రస్తుత ప్యాక్ గడువు ముగియకముందే రీచార్జ్ చేసుకునే వెసులుబాటు ఈ ప్యాక్‌లలో కల్పించింది. బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ వోచర్ (పీవీ), స్పెషల్ టారిఫ్ ఓచర్ (ఎస్టీవీ) వినియోగదారులందరికీ ఈ ప్లాన్లు వర్తిస్తాయి. రూ. 97 నుంచి రూ. 1,999 వరకు ఈ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. 3జీబీ హైస్పీడ్ డేటా, 100 వాయిస్ కాలింగ్ నిమిషాలతో బీఎస్ఎన్ఎల్ ఇటీవల రూ.94, రూ. 95తో ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొచ్చింది. అలాగే, రూ. 499తో బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను కూడా ప్రకటించింది. ఇందులో 100 జీబీ డేటా 20 ఎంబీపీఎస్ వేగంతో లభిస్తుంది. 


ఇక తాజాగా ప్రకటించిన ప్లాన్లలో రూ. 97, రూ. 98, రూ.118, రూ.187, రూ. 247, రూ. 319, రూ. 399, రూ. 429, రూ. 485, రూ. 666, రూ. 699, రూ. 997, రూ. 1,699, రూ. 1,999 ప్లాన్లు ఉన్నాయి. ప్రస్తుత ప్లాన్ గడువు ముగియక ముందే వీటిని రీచార్జ్ చేసుకోవచ్చు. గడువు ముగిసిన తర్వాత కొత్త ప్లాన్ దానంతట అదే యాక్టివేట్ అవుతుంది. 

Updated Date - 2020-07-11T00:55:51+05:30 IST