కరోనాతో కొత్త ప్రాజెక్టులకు బ్రేక్‌

ABN , First Publish Date - 2020-10-03T07:05:56+05:30 IST

రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్లో కొత్తగా అందుబాటులోకి వచ్చిన గృహాల సంఖ్య భారీగా తగ్గిందని ప్రాపర్టీ కన్సల్టింగ్‌ సంస్థ అనరాక్‌ వెల్లడించింది...

కరోనాతో కొత్త ప్రాజెక్టులకు బ్రేక్‌

  • దేశంలోని 7 ప్రధాన నగరాల్లో 60 శాతం తగ్గిన కొత్త ఇళ్ల సరఫరా..
  • అనరాక్‌ తాజా నివేదిక వెల్లడి  


న్యూఢిల్లీ: రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్లో కొత్తగా అందుబాటులోకి వచ్చిన గృహాల సంఖ్య భారీగా తగ్గిందని ప్రాపర్టీ కన్సల్టింగ్‌ సంస్థ అనరాక్‌ వెల్లడించింది. ఈ ఏడాది జనవరి-సెప్టెంబరు మధ్య కాలంలో దేశంలోని 7 ప్రధాన నగరాల్లో కొత్తగా అందుబాటులోకి వచ్చిన గృహాలు 75,150 యూనిట్లు మాత్రమే. గత ఏడాదిలో ఇదేకాలానికి అందుబాటులోకి వచ్చిన 1,84,700 గృహాలతో పోలిస్తే దాదాపు 60 శాతం తగ్గాయి. కరోనా దెబ్బకు డిమాండ్‌ భారీ గా పతనమవడంతో డెవలపర్లు కొత్త ప్రాజెక్టులను వాయిదా వేసుకోవడం ఇందుకు కారణమ ని అనరాక్‌ వెల్లడించింది.


ఇళ్ల సరఫరానే కాదు, విక్రయాలూ భారీగా క్షీణించాయి. సమీక్షా కాలానికి దేశంలోని 7 ప్రధాన నగరాల్లో గృహ విక్రయాలు 57 శాతం క్షీణించి 87,460 యూనిట్లకు పరిమితమయ్యాయి. గత ఏడాది ఇదే కాలంలో 2,02,200 యూనిట్లు అమ్మడయ్యాయి. టాప్‌-7 నగరాల్లో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌ (ఎంఎంఆర్‌), కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌, పుణె ఉన్నాయి. 

Updated Date - 2020-10-03T07:05:56+05:30 IST