బ్రేకౌట్‌ సాధిస్తేనే..

ABN , First Publish Date - 2020-07-27T08:55:33+05:30 IST

బ్రేకౌట్‌ సాధిస్తేనే..

బ్రేకౌట్‌ సాధిస్తేనే..

అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉండటంతో గత వారం దేశీయ స్టాక్‌ మార్కెట్లు పాజిటివ్‌గానే సాగాయి. టెక్నికల్‌గా మార్కెట్లు ఓవర్‌బాట్‌ పొజిషన్‌లోనే ఉన్నాయి. ఈ వారం డెరివేటివ్స్‌ ముగియనుండటంతో అందరి దృష్టి కీలక మద్దతు స్థాయిలపైనే ఉంది. ఈ వారం 11250 వద్ద బ్రేకౌట్‌ సాధిస్తే 11350-11400 స్థాయిలకు చేరుకునే అవకాశం ఉంది. ఒకవేళ డౌన్‌ట్రెండ్‌లోకి సాగితే 11050 వద్ద మద్దతు స్థాయిలు ఉంటాయి. బ్యాంక్‌ నిఫ్టీ కూడా 23000-23200 మధ్య ట్రేడయ్యే అవకాశాలున్నాయి. 


స్టాక్‌ రికమండేషన్స్‌

నాట్కో ఫార్మా: కరోనా వైరస్‌ నేపథ్యంలో ఫార్మా షేర్లన్నీ వెలుగులోకి వచ్చాయి. దీంతో నాట్కో షేరు కూడా బుల్లిష్‌ జోన్‌లో సాగు తూ కొత్త గరిష్ఠ స్థాయిలను నమోదు చేసుకుంటూ వస్తోంది. గత శుక్రవారం రూ.729.85 వద్ద క్లోజైన ఈ షేరును రూ.668 స్టాప్‌లా్‌సగా పెట్టుకుని రూ.800 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. 


ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా: 2018 మే నుంచి ఆటుపోట్లు ఎదుర్కొంటూ వస్తున్న ఈ షేరు గత కొద్ది నెలలుగా ఆకర్షణీయంగా మారింది. ఈ నెలలోనే దాదాపు 44 శాతం లాభాలను అందించింది. రానున్న రోజుల్లో ఇదే జోరును కొనసాగించవచ్చు. గత వారం రూ.122..55 వద్ద క్లోజైన ఈ షేరును రానున్న వారాలకు రూ.132 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.120.20 ధరను స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.   - సమీత్‌ చవాన్‌, చీఫ్‌ అనలిస్ట్‌ టెక్నికల్‌, డెరివేటివ్స్‌, ఏంజెల్‌ బ్రోకింగ్‌


నోట్‌: పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.

Updated Date - 2020-07-27T08:55:33+05:30 IST