బిట్‌కాయిన్ @ 20,000 డాలర్లు
ABN , First Publish Date - 2020-12-17T07:11:17+05:30 IST
ప్రముఖ క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ విలువ తొలిసారిగా 20,000 డాలర్ల మైలురాయిని దాటింది.

లండన్: ప్రముఖ క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ విలువ తొలిసారిగా 20,000 డాలర్ల మైలురాయిని దాటింది. బుధవారం నాడు ఈ డిజిటల్ కరెన్సీ 4.5 శాతం ఎగబాకి 20,440 డాలర్ల స్థాయికి చేరుకుంది.
ఈ ఏడాదిలో ఇప్పటివరకు బిట్‌కాయిన్ విలువ 170 శాతం వృద్ధి చెందడం గమనార్హం.