చికున్‌గున్యా టీకా అభివృద్ధికి భారత్‌ బయో కన్సార్టియంకు నిధులు

ABN , First Publish Date - 2020-06-04T06:02:04+05:30 IST

చికున్‌గున్యా టీకా అభివృద్ధిని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు భారత్‌ బయోటెక్‌ (బీబీఐఎల్‌), ఇంటర్నేషనల్‌ వ్యాక్సిన్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐవీఐ)తో కొలిషన్‌ ఫర్‌ ఎపిడెమిక్‌ ప్రిపేర్డ్‌నెస్‌ ఇన్నోవేషన్స్‌ (సీఈపీఐ) ఒప్పందం కుదుర్చుకుంది...

చికున్‌గున్యా టీకా అభివృద్ధికి భారత్‌ బయో కన్సార్టియంకు నిధులు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): చికున్‌గున్యా టీకా అభివృద్ధిని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు భారత్‌ బయోటెక్‌ (బీబీఐఎల్‌), ఇంటర్నేషనల్‌ వ్యాక్సిన్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐవీఐ)తో కొలిషన్‌ ఫర్‌ ఎపిడెమిక్‌ ప్రిపేర్డ్‌నెస్‌ ఇన్నోవేషన్స్‌ (సీఈపీఐ) ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి  బయోటెక్నాలజీ విభాగం అమలు చేస్తున్న ఇండియా సెంట్రిక్‌ ఎపిడెమిక్‌ ప్రిపేర్డ్‌నెస్‌ త్రూ రాపిడ్‌ వ్యాక్సిన్‌ డెవలప్‌మెంట్‌ (ఇండ్‌-సీఈపీఐ) సహకారం అందిస్తుంది.


రెండు డోసుల లైవ్‌-ఇన్‌యాక్టివేటెడ్‌ వ్యాక్సిన్‌ (బీబీవీ87) తయారీ, క్లినికల్‌ పరీక్షలకు సీఈపీఐ 1.41 కోట్ల డాలర్ల వరకూ సాయం అందిస్తుంది. భారత్‌లో టీకా తయారీకి జీఎంపీ ప్రమాణాల యూనిట్లను ఏర్పాటు చేయడానికి ఇండ్‌-సీఈపీఐ 2 మిలియన్‌ డాలర్లు సమకూరుస్తుంది. భారత్‌ బయో తయారు చేయనున్న బీబీవీ87 వ్యాక్సిన్‌ ప్రీ క్లినికల్‌ అధ్యయనాలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇప్పటి వరకూ చికున్‌గున్యాకు లైసెన్స్‌ పొందిన వ్యాక్సిన్‌, చికిత్స లేదని సీఈపీఐ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) రిచర్డ్‌ హచెట్‌ అన్నారు. టీకాను అభివృద్ధికి సీఈపీఐతో చేతులు కలపడం ఆనందంగా ఉందని భారత్‌ బయోటెక్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కృష్ణ ఎల్లా తెలిపారు.


Updated Date - 2020-06-04T06:02:04+05:30 IST