భారతి ఆక్సా-ఎయిర్‌టెల్ పేమెంట్స్
ABN , First Publish Date - 2020-04-07T05:48:22+05:30 IST
ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ తమ కస్టమర్లకు కోవిడ్-19ను ఎదుర్కొనేందుకు అవసరమైన ఆరోగ్య బీమా స్కీమ్‌లు అందించడానికి భారతి ఆక్సా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీతో భాగస్వామ్యం...

- కోవిడ్ బీమా ప్లాన్లు
ముంబై : ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ తమ కస్టమర్లకు కోవిడ్-19ను ఎదుర్కొనేందుకు అవసరమైన ఆరోగ్య బీమా స్కీమ్‌లు అందించడానికి భారతి ఆక్సా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద ఆ కంపెనీలు రెండు ఆరోగ్య బీమా స్కీమ్‌లు అందుబాటులోకి తెచ్చాయి. భారతి ఆక్సా గ్రూప్ హెల్త్ అష్యూర్ పేరిట అందిస్తున్న స్కీమ్ బాధితులకు రూ.25,000 ఏకమొత్తంలో బీమా అందిస్తుంది. గ్రూప్ హాస్పిటల్ క్యాష్ పేరిట అందించే ప్లాన్ కింద రోగులకు ఆస్పత్రిలో ఉన్న సమయంలో గరిష్ఠంగా 10 రోజుల పాటు రూ.500, రూ.1000 రోజువారీ ప్రయోజనం కల్పిస్తుంది. ఇవి పొందడానికి ఎలాంటి వైద్యపరీక్షలు అవసరం లేదు. పాలసీల కాలపరిమితి ఏడాది.