ఈఎస్‌ఓపీ చెక్ క్యాష్ కరోతో ఉద్యోగులకు భారత్ పే బంపర్ ఆఫర్..

ABN , First Publish Date - 2020-07-29T02:56:50+05:30 IST

ప్రముఖ ఆన్‌లైన్ లావాదేవీల సంస్థ భారత్ పే ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. అందులో భాగంగా ఉద్యోగులందరూ...

ఈఎస్‌ఓపీ చెక్ క్యాష్ కరోతో ఉద్యోగులకు భారత్ పే బంపర్ ఆఫర్..

హైదరాబాద్: ప్రముఖ ఆన్‌లైన్ లావాదేవీల సంస్థ భారత్ పే ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. అందులో భాగంగా ఉద్యోగులందరూ తమ ఈఎస్‌ఓపీ(ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్స్ ప్లాన్) షేర్లను అమ్ముకునేందుకు అవకాశం కల్పించింది. ఈ ఆఫర్‌తో ఒక్కో ఉద్యోగికి రూ.7లక్షల వరకు లాభం చేకూరనుంది. సంస్థలో చేరే సమయంలోనే ఉద్యోగులకు అపాయింట్‌మెంట్ ఆర్డర్‌తో పాటు ఈఎస్ఓపీ గ్రాంట్‌ను కూడా భారత్ పే అందజేసింది. ఈ గ్రాంట్‌కు ఎలాంటి ధరను కూడా నిర్ణయించలేదు. ఉద్యోగులు సంస్థను వీడినప్పటికీ 5ఏళ్లలోపు ఈ ఈఎస్ఓపీలను నగదుగా మార్చుకునే అవకాశాన్ని భారత్ పే వారికి కల్పించింది. అయితే ప్రస్తుతం సంస్థ పరిచయం చేసిన ఈఎస్ఓపీ చెక్ క్యాష్ కరో విధానంతో ఉద్యోగులకు అంతకంటే ముందే లాభం చేకూరనుంది. సంస్థలో చేరి ఏడాది మాత్రమే పూర్తి చేసుకున్న ఉద్యోగులకు 25 శాతం నగదు చేసుకునే వీలుంటుందని, అంతకంటే ఎక్కువ కాలం సంస్థలో పనిచేసిన వారికి నెలకు 2శాతం చొప్పున పెరుగుతుందని సంస్థ తెలిపింది.


ఈ స్కీంతో ఉద్యోగుల్లో సంస్థపై నమ్మకం మరింత పెరుగుతుందని పేర్కొంది. సంస్థ తరపున అందిన ఈఎస్ఓపీ చెక్కులను బ్యాంకులలో జమ చేయడం ద్వారా ఉద్యోగులు నగుదుగా మార్చుకోవచ్చని ప్రకటించింది. ఇదిలా ఉంటే భారత్ పే ప్రకటించిన ఈ ఆఫర్‌తో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరోనాతో అనేక కష్టాలు పడుతున్న ఇలాంటి తరుణంలో సంస్థ ఈ అవకాశాన్ని కల్పించడం తమకు ఎంతో లాభం చేకూరుస్తుందని చెబుతున్నారు.

Updated Date - 2020-07-29T02:56:50+05:30 IST