డిస్కౌంట్ ఆరోగ్య పథకాలపై జర జాగ్రత్త: ఐఆర్‌డీఏఐ
ABN , First Publish Date - 2020-10-07T07:03:57+05:30 IST
అనధికారిక వ్యక్తులు లేదా సంస్థలు విక్రయించే ఆరోగ్య బీమా పాలసీలపై అప్రమత్తంగా ఉండాలని బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏ హెచ్చరించింది. వైద్య సేవలు, రోగ నిర్ధారణ పరీక్షలపై డిస్కౌంట్ పేరుతో వీరు చెప్పే మాటలను ఏ మాత్రం నమ్మొద్దని ప్రజలను కోరింది...

న్యూఢిల్లీ: అనధికారిక వ్యక్తులు లేదా సంస్థలు విక్రయించే ఆరోగ్య బీమా పాలసీలపై అప్రమత్తంగా ఉండాలని బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏ హెచ్చరించింది. వైద్య సేవలు, రోగ నిర్ధారణ పరీక్షలపై డిస్కౌంట్ పేరుతో వీరు చెప్పే మాటలను ఏ మాత్రం నమ్మొద్దని ప్రజలను కోరింది. ఐఆర్‌డీఏఐ వద్ద నమోదైన బీమా కంపెనీలు లేదా వారి అధీకృత ఏజెంట్ల నుంచి మాత్రమే ఆరోగ్య బీమా పాలసీలు తీసుకోవాలని స్పష్టం చేసింది. తమ వద్ద నమోదైన బీమా కంపెనీల జాబితా తమ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని తెలిపింది. ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే, ఆయా బీమా కంపెనీలను సంప్రదించి నిర్దారించుకోవాలని కోరింది. కొన్ని సంస్థలు, కొంత మంది వ్యక్తులు అనధికారికంగా వైద్య సేవలు, రోగ నిర్ధారణ పరీక్షలపై డిస్కౌంట్స్ పేరుతో పాలసీలు మార్కెట్ చేస్తున్నట్టు తెలియడంతో ఈ ప్రకటన విడుదల చేసింది.