నెల లోపే... రూ. 60 వేల కోట్లకు పైగానే...
ABN , First Publish Date - 2020-12-27T21:55:52+05:30 IST
భారత్‌లోకి విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఈ(డిసెంబరు) నెల 1-24 తేదీల మధ్య రూ. 60 వేల కోట్లకు పైగా ఫారన్ పోర్ట్‌పోలియో ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టడం విశేషం. అక్షరాలా రూ. 60,094 కోట్ల మేర పెట్టుబడులొచ్చాయి.

న్యూఢిల్లీ : భారత్‌లోకి విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఈ(డిసెంబరు) నెల 1-24 తేదీల మధ్య రూ. 60 వేల కోట్లకు పైగా ఫారన్ పోర్ట్‌పోలియో ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టడం విశేషం. అక్షరాలా రూ. 60,094 కోట్ల మేర పెట్టుబడులొచ్చాయి. ఇందులో ఈక్విటీలలో రూ. 56,643 కోట్లు, డెబిట్‌లో రూ. 3,451 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. నవంబరు నెలలో మొత్తం రూ. 62,951 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అమెరికా ఎన్నికలు, ఫలితాల అనంతరం దేశంలోకి ఎఫ్‌పీఐ ఇన్-ఫ్లో భారీగా పెరిగిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ ఆఫ్ రీసెర్చ్ వినోద్ నాయర్ అన్నారు.
భారత్‌లోకి పెట్టుబడులు కరోనా మహమ్మారి, లాక్ డౌన్ నేపధ్యంలో మార్చి చివరి వారం నుండి ఎఫ్‌పీఐ లు పడిపోయాయి. రిస్క్ కారణంగా అన్-లాక్ తర్వాత కూడా పెట్టుబడిదారులు ఇన్వెస్ట్‌మెంట్స్‌ను హోల్డ్‌లో పెట్టారు. అయితే అగ్రరాజ్యాలతో పోలిస్తే భారత్‌లో కరోనా కేసులు వేగంగా తగ్గిపోవడం, రికవరీలు వేగంగా పెరగడం వంటి వివిధ కారణాలతో గత కొద్ది నెలలుగా పెట్టుబడులు పెరుగుతున్నాయి.