బాటా 126 ఏళ్ల చరిత్రలో తొలిసారి సంచలన నిర్ణయం!

ABN , First Publish Date - 2020-12-02T00:55:53+05:30 IST

ప్రపంచవ్యాప్త గుర్తింపు కలిగిన పాదరక్షల తయారీ సంస్థ బాటా సంచలన నిర్ణయం తీసుకుంది. 126లో కంపెనీ చరిత్రలో తొలిసారి ఓ

బాటా 126 ఏళ్ల చరిత్రలో తొలిసారి సంచలన నిర్ణయం!

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్త గుర్తింపు కలిగిన పాదరక్షల తయారీ సంస్థ బాటా సంచలన నిర్ణయం తీసుకుంది. 126లో కంపెనీ చరిత్రలో తొలిసారి ఓ భారతీయుడిని గ్లోబల్ సీఈవోగా నియమించింది. సందీప్ కటారియా (49)ను కంపెనీ సీఈవోగా నియమించినట్టు బాటా ఇండియా లిమిటెడ్ తెలిపింది. ప్రస్తుతం గ్లోబల్ సీఈవోగా ఉన్న అలెగ్జిస్ నజార్డ్ నుంచి కటారియా బాధ్యతలు స్వీకరించనున్నారు. కటారియా సారథ్యంలో కంపెనీ స్థిర అభివృద్ధి, లాభదాయకతవైపు దూసుకు వెళ్తుందని బాటా ఆశాభావం వ్యక్తం చేసింది.


మార్కెట్లోకి కొత్త కంపెనీలు ఎన్ని వచ్చినా బాటా మాత్రం మార్కెట్లో తన వాటాను నిలబెట్టుకుంటూనే ఉంది. ముఖ్యంగా యువ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. కొత్త సీఈవోగా ఎన్నికైన కటారియాను బాటా ఇండియా లిమిటెడ్ చైర్‌పర్సన్ అశ్విని విండ్‌లాస్ అభినందించారు. సీఈవోగా ఎన్నికవడంపై కటారియా హర్షం వ్యక్తం చేశారు. ఇది తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పారు.  


1984లో ప్రారంభమైన బాటా ప్రతి ఏడాది 5,800 స్టోర్ల ద్వారా 180 మిలియన్లకుపైగా పాదరక్షలు విక్రయిస్తోంది. 70 దేశాల్లో సేవలు అందిస్తున్న బాటాకు 35 వేలమంది కార్మికులు ఉన్నారు. ఐదు ఖండాల్లో మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉన్నాయి. భారత్‌లో ప్రతి సంవత్సరం 50 మిలియన్ జతలు విక్రయిస్తోంది. రోజుకు 1.20 లక్షల మంది వినియోగదారులకు సేవలు అందిస్తోంది. యూనిలివర్‌లో 24 ఏళ్ల అనుభవం కలిగిన కటారియా.. 2017లో బాటా ఇండియా సీఈవోగా చేరడానికి ముందు యమ్ బ్రాండ్స్, వొడాఫోన్ ఇండియా, యూరప్‌లలో పనిచేశారు. 

Updated Date - 2020-12-02T00:55:53+05:30 IST