బజాజ్ ఫైనాన్స్... రూ. 3 లక్షల కోట్లు దాటి...

ABN , First Publish Date - 2020-12-15T22:27:56+05:30 IST

బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ మంగళవారం (డిసెంబర్ 15) నాటికి 3 ట్రిలియన్ డాలర్లు దాటింది. బీఎస్ఈలో ఈ సంస్థ స్టాక్ ఈ రోజు 5 శాతం లాభపడి రూ. 5,137 కు ఎగసింది.

బజాజ్ ఫైనాన్స్... రూ. 3 లక్షల కోట్లు దాటి...

ముంబై : బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ మంగళవారం (డిసెంబర్ 15) నాటికి 3 ట్రిలియన్ డాలర్లు దాటింది. బీఎస్ఈలో ఈ సంస్థ స్టాక్ ఈ రోజు 5 శాతం లాభపడి రూ. 5,137 కు ఎగసింది.


దీంతో సంస్థ మార్కెట్ క్యాప్ రూ. 3.08 ట్రిలియన్లను అందుకుంది. బజాజ్ ఫైనాన్స్ స్టాక్ మధ్యాహ్నం 2.30 గంటల సమయానికి రూ. 5,120 వద్ద ఉంది. మే 27 న ఈ కంపెనీ స్టాక్ రూ. 1,783 వద్ద ట్రేడ్ అయింది. నాటి నుండి ఇప్పటి వరకు 188 శాతం కంటే ఎక్కువగా ఎగసింది. ఏడాదిలో ఈ స్టాక్ 21 శాతం వృద్ధిని నమోదు చేసింది. 
Updated Date - 2020-12-15T22:27:56+05:30 IST