బజాజ్ ఫైనాన్స్... తేలికగా రూ. 25 లక్షల రుణం..!

ABN , First Publish Date - 2020-12-27T21:09:09+05:30 IST

ప్రముఖ ఆర్ధిక సహకార సంస్థ... బజాజ్ ఫైనాన్స్... ప్రస్తుతం భారీ రుణాలను కూడా తేలికగానే అందిస్తోది. అయితే... ఈ వెసులుబాటు అందరికీ అందుబాటులో ఉండదు. ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది.

బజాజ్ ఫైనాన్స్... తేలికగా రూ. 25 లక్షల రుణం..!

హైదరాబాద్ : ప్రముఖ ఆర్ధిక సహకార సంస్థ... బజాజ్ ఫైనాన్స్... ప్రస్తుతం భారీ రుణాలను కూడా తేలికగానే అందిస్తోది. అయితే... ఈ వెసులుబాటు అందరికీ అందుబాటులో ఉండదు. ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది.  

కాగా... ఈ రుణాలను కేవలం 3 స్టెప్స్‌లోనే పొందొచ్చు. కస్టమర్ల అర్హతల ప్రాతిపదికన ఈ రుణాలు అందుతాయి. మరిన్ని వివరాలిలా ఉన్నాయి. 

బజాజ్ ఫైనాన్స్ ఎలాంటి గ్యారంటీ లేకుండానే ప్రిఅప్రూవ్డ్ లోన్ కింద రూ. 25 లక్షల వరకు అందిస్తోంది. బజాజ్ ప్రి అప్రూవ్డ్ రుణాలను వేగంగా క్షణాల్లోనే పొందొచ్చు. ఎలాంటి డాక్యుమెంట్లు కూడా అవసరం ఉండదు. అయితే ఇక్కడ ఇలాంటి ప్రిఅప్రూవ్డ్ రుణాలు కేవలం కొంత మందికి మాత్రమే అందుబాటులో ఉంటాయి.

బజాజ్ ఫైనాన్స్ నుంచి ప్రి అప్రూవ్డ్ రుణాలు పొందాలని భావించే వారు ముందుగా బజాజ్ ఫిన్‌సర్వ్ వెబ్‌సైట్‌కు వెళ్లాలి. ఇక్కడ మొబైల్ నెంబర్, ఓటీపీ సాయంతో లాగిన్ అవ్వాలి. ప్రిఅప్రూవ్డ్ ఆఫర్లను చెక్ చేసుకోవాలి. మీకు ఆఫర్ అందుబాటులో ఉంటే లోన్ టెన్యూర్ ఎంపిక చేసుకొని దరఖాస్తు చేసుకోవాలి.

కాగా... ఈ రుణాలను పొందాలనుకున్న వారు... భారతీయ పౌరులై ఉండాలి. 750 కి పైగా క్రెడిట్ స్కోర్ ఉండాలి. ప్రతి నెలా ఆదాయం పొందుతూ ఉండాలి. ఇక... 23-55 ఏళ్లలోపు వయసు కలిగి ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారు లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు.

Updated Date - 2020-12-27T21:09:09+05:30 IST