బీన్యూ వార్షికోత్సవ ఆఫర్లు

ABN , First Publish Date - 2020-09-03T06:04:19+05:30 IST

ఉభయ తెలుగు రాష్ర్టాల్లో 75 షోరూమ్‌లు నడుపుతున్న మొబైల్‌ రిటైలింగ్‌ కంపెనీ బీన్యూ 7వ వార్షికోత్సవ ఆఫర్లు ప్రకటించింది. ఎంపిక చేసిన మొబైల్‌ యాక్సెసరీలు, టాబ్‌ల కొనుగోళ్లపై 66 శాతం డిస్కౌంట్‌ ఇస్తున్నట్టు కంపెనీ సీఎండీ వైడీ బాలాజీ చౌదరి తెలిపారు...

బీన్యూ వార్షికోత్సవ ఆఫర్లు

హైదరాబాద్‌: ఉభయ తెలుగు రాష్ర్టాల్లో 75 షోరూమ్‌లు నడుపుతున్న మొబైల్‌ రిటైలింగ్‌ కంపెనీ బీన్యూ 7వ వార్షికోత్సవ ఆఫర్లు ప్రకటించింది. ఎంపిక చేసిన మొబైల్‌ యాక్సెసరీలు, టాబ్‌ల కొనుగోళ్లపై 66 శాతం డిస్కౌంట్‌ ఇస్తున్నట్టు కంపెనీ సీఎండీ వైడీ బాలాజీ చౌదరి తెలిపారు. ఆరు సంవత్సరాల క్రితం ఒకే ఒక స్టోర్‌తో ప్రారంభించి ఈ రోజు 75 ఔట్‌లెట్లకు విస్తరించడానికి కస్టమర్ల ఆదరణే కారణమంటూ అందుకు బహుమతిగా ఈ ఆఫర్లు ప్రకటిస్తున్నట్టు చెప్పారు. తమ షోరూమ్‌లలో రూ.500 నుంచి రూ.1,30,000 వరకు ధరల శ్రేణిలో అన్ని రకాల మొబైల్‌ ఫోన్లు అందుబాటులో ఉన్నాయని, ప్రతీ కొనుగోలుపై కస్టమర్లకు కచ్చితమైన బహుమతితో పాటు రూ.6,000 కాష్‌బ్యాక్‌ సదుపాయం కూడా కల్పిస్తున్నామని బాలాజీ  చెప్పారు. 

Updated Date - 2020-09-03T06:04:19+05:30 IST