రూ.275 కోట్లతో వ్యాక్సిన్‌ తయారీ యూనిట్‌

ABN , First Publish Date - 2020-11-13T08:29:35+05:30 IST

వ్యాక్సిన్ల తయారీకి అరబిందో ఫార్మా రూ.250-275 కోట్లతో కొత్త యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. 40-45 కోట్ల డోసుల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్లాంట్‌ ఏప్రిల్‌ నాటికి అందుబాటులోకి వస్తుందని కంపెనీ వెల్లడించింది...

రూ.275 కోట్లతో వ్యాక్సిన్‌ తయారీ యూనిట్‌

  • ఇతర కంపెనీలకు కాంట్రాక్టుపై కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఉత్పత్తి
  • అరబిందో ఫార్మా ప్రకటన

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): వ్యాక్సిన్ల తయారీకి అరబిందో ఫార్మా రూ.250-275 కోట్లతో కొత్త యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. 40-45 కోట్ల డోసుల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్లాంట్‌ ఏప్రిల్‌ నాటికి అందుబాటులోకి వస్తుందని కంపెనీ వెల్లడించింది. సొంతగా కొవిడ్‌ వ్యాక్సిన్‌ అభివృద్ధి చేస్తున్న అరబిందో ఇతరులకు కాంట్రాక్టు ప్రాతిపదికన కొవిడ్‌ వ్యాక్సిన్‌ తయారు చేయడానికి సిద్ధంగా ఉంది. ఇందుకోసం కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకునే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కంపెనీ ఎండీ ఎన్‌ గోవిందరాజన్‌ తెలిపారు. 


అనుబంధ సంస్థ ఆరో వ్యాక్సిన్స్‌ ద్వారా కొవిడ్‌ -19 వైర్‌సకు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు కంపెనీ దాదాపు 2-3 నెలల క్రితం వెల్లడించింది. ప్రోఫెక్టస్‌ బయోసైన్సెస్‌ రూపొదించిన ఈ వ్యాక్సిన్‌ ప్రస్తుతం ప్రీ క్లినికల్‌ పరీక్షల దశలో ఉంది. సీసీఎంబీ, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ టెక్నాలజీ (ఐఎంటెక్‌), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ బయాలజీ (ఐఐసీబీ) మూడు భిన్న టెక్నాలజీ ప్లాట్‌ఫారమ్‌లపై అభివృద్ధి చేస్తున్న కొవిడ్‌ వ్యాక్సిన్ల క్లినికల్‌ పరీక్షల నిర్వహణ, వాణిజ్యపరంగా మార్కెట్‌లోకి తీసుకురావడానికి వాటితో అరబిందో ఫార్మా ఒప్పందాలు కుదుర్చుకుంది.  

6ు పైగా పెరిగిన షేర్‌

బీఎ్‌సఈలో అరబిందో షేరు ధర 6.47 శాతం వరకూ పెరిగి రూ.863.60 తాకింది. చివరకు 3.44 శాతం లాభంతో రూ.838.95 వద్ద ముగిసింది. 


Updated Date - 2020-11-13T08:29:35+05:30 IST