అరబిందో రియల్టీ చేతికి బొగ్గు గని

ABN , First Publish Date - 2020-11-07T06:04:09+05:30 IST

కమర్షియల్‌ బొగ్గు గనుల వేలంలో హైదరాబాద్‌కు చెందిన అరబిందో రియల్టీ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మరో బొగ్గు గనిని దక్కించుకుంది.శుక్రవారంతో ఐదో రోజుకు చేరిన వేలం ప్రక్రియలో జార్ఖండ్‌కు చెందిన ఉర్మా పహరిటోలా...

అరబిందో రియల్టీ చేతికి బొగ్గు గని

  • జార్ఖండ్‌లోని మైన్‌ను దక్కించుకున్న సంస్థ 


న్యూఢిల్లీ: కమర్షియల్‌ బొగ్గు గనుల వేలంలో హైదరాబాద్‌కు చెందిన అరబిందో రియల్టీ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మరో బొగ్గు గనిని దక్కించుకుంది.శుక్రవారంతో ఐదో రోజుకు చేరిన వేలం ప్రక్రియలో జార్ఖండ్‌కు చెందిన ఉర్మా పహరిటోలా బొగ్గు గనిని కంపెనీ చేజిక్కించుకుంది. మిగతా బిడ్డర్లతో పోలిస్తే అరబిందో రియల్టీ అత్యధికంగా 26.50 శాతం ఆదా య పంపిణీ ఆఫర్‌ చేసింది. అదానీ పవర్‌ రిసోర్సెస్‌,వెల్‌స్పన్‌ స్టీల్‌ కూడా ఈ గని కోసం పోటీపడ్డాయి. 57.930 కోట్ల టన్నుల మేర బొగ్గు నిల్వలున్న ఈ గని ద్వారా ఏటా రూ.1,415.85 కోట్ల మేర ఆదాయం ఆర్జించే వీలుంది. కమర్షియల్‌ బొగ్గు గనుల వేలంలో అరబిందో దక్కించుకున్న రెండో గని ఇది. తొలిరోజు వేలంలో మహారాష్ట్రలోని తక్లి-జెనా-బెల్లోరా (ఉత్తర, దక్షిణ) కోల్‌ బ్లాక్‌ను కంపెనీ కైవసం చేసుకుంది. 


Updated Date - 2020-11-07T06:04:09+05:30 IST