కరోనాకు ‘యాంటీబాడీ’

ABN , First Publish Date - 2020-05-09T05:36:29+05:30 IST

కోవిడ్‌-19 వైరస్‌ సోకిన వారికి చికిత్స చేయడానికి ‘యాంటీ బాడీ’ ని తయారు చేసే ప్రాజెక్టులో హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ పాలుపంచుకోనుంది.

కరోనాకు ‘యాంటీబాడీ’

  • 6 నెలల్లో అభివృద్ధి
  • భారత్‌ బయోటెక్‌ ఆధ్వర్యంలో ప్రాజెక్టు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కోవిడ్‌-19 వైరస్‌ సోకిన వారికి చికిత్స చేయడానికి ‘యాంటీ బాడీ’ ని తయారు చేసే ప్రాజెక్టులో హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ పాలుపంచుకోనుంది. భారత్‌ బయోటెక్‌ ఆధ్వర్యంలో నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సెల్‌ సైన్స్‌ (ఎన్‌సీసీఎస్‌), ఐఐటీ ఇండోర్‌, గురుగ్రామ్‌కు చెందిన కంపె నీ ప్రెడోమిక్స్‌ టెక్నాలజీస్‌.. వచ్చే ఆరు నెలల్లో కరోనా వైరస్‌ చికిత్సకు మానవ మోనోక్లోనల్‌ యాంటీ బాడీలను అభివృద్ధి చేయనున్నాయి. న్యూ మిలీనియం ఇండియన్‌ టెక్నాలజీ లీడర్‌షిప్‌ ఇన్షియేటివ్‌ (ఎన్‌ఎంఐటీఎల్‌ఐ) కార్యక్రమం కింద ఈ ప్రాజెక్టును సీఎ్‌సఐఆర్‌ మంజూరు చేసిందని భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్లా తెలిపారు. కరోనా వైర్‌సను నియంత్రించడానికి ఔషధాలు, వ్యాక్సిన్లను అభివృద్ధి చేసే ప్రక్రియ కొనసాగుతున్నా.. అది చాలా నిదానంగా జరిగే ప్రక్రియ, వ్య యంతో కూడిన వ్యవహారంగా భావిస్తున్నారు.


త్వరగా ప్రత్యామ్నాయ చికిత్స వ్యవస్థ అవసరమని, ఆ దిశగా మానవ మోనోక్లోనల్‌ యాంటీబాడీలను అభివృద్ధి చేస్తున్నామని కృష్ణ వివరిచారు. సార్స్‌-కోవ్‌2 వైర్‌సను ఎదుర్కొవడానికి సమర్థమంతమైన, ప్రత్యేకమైన హ్యూమన్‌ మోనోక్లోనల్‌ యాంటీబాడీ్‌సను అభివృద్ధి చేయడం ఈ ప్రాజెక్ట్‌ లక్ష్యం. మానవ యాంటీబాడీతో ఎలుకలోని చిన్న భాగం లేదా ఎలుక మోనోక్లోనల్‌ యాంటీబాడీతో కలిపి లేబొరేటరీలో హ్యూమన్‌ మోనోక్లోనల్‌ యాంటీబాడీ్‌సను తయారు చేస్తారు.  

Updated Date - 2020-05-09T05:36:29+05:30 IST