త్వరలో మరో ఉద్దీపన ప్యాకేజీ

ABN , First Publish Date - 2020-04-18T07:57:53+05:30 IST

చతికిలపడిన ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలో మరో ఆర్థిక ఉద్దీపన ప్రకటించబోతోంది. ప్రపంచ బ్యాంక్‌ అభివృద్ధి కమిటీ

త్వరలో మరో ఉద్దీపన ప్యాకేజీ

  • ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

న్యూఢిల్లీ: చతికిలపడిన ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలో మరో ఆర్థిక ఉద్దీపన ప్రకటించబోతోంది. ప్రపంచ బ్యాంక్‌ అభివృద్ధి కమిటీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ విషయం వెల్లడించారు. ఉద్దీపన ప్యాకేజీతో పాటు లాక్‌డౌన్‌తో ఇబ్బంది పడుతున్న అట్టడుగు వర్గాల ప్రజల కోసం మరిన్ని ఉపశమన చర్యలూ ఉంటాయని చెప్పారు. అయితే ఉద్దీపన ప్యాకేజీ ఏ స్థాయిలో ఉంటుందనేది మాత్రం ఆర్థిక మంత్రి వెల్లడించలేదు. కరోనా నేపథ్యంలో సామాన్య ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికే రూ.1.7 లక్షల కోట్లతో ప్రత్యేక సహా య ప్యాకేజీ ప్రకటించింది. ఇవి ఎంత మాత్రం చాలవనే విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం మరో సహాయ, ఉద్దీపన ప్యాకేజీలకు సిద్ధమవుతోంది.

Updated Date - 2020-04-18T07:57:53+05:30 IST