బాటా గ్లోబల్ సీఈఓగా భారతీయుడు...

ABN , First Publish Date - 2020-12-01T20:56:46+05:30 IST

బాటా గ్లోబల్ ఫుట్‌వేర్ సంస్థకు ముఖ్యకార్యనిర్వహణాధికారి(సీఈఓ)గా ఓ భారతీయుడు నియమితులయ్యారు.

బాటా గ్లోబల్ సీఈఓగా భారతీయుడు...

ముంబై : బాటా గ్లోబల్ ఫుట్‌వేర్ సంస్థకు ముఖ్యకార్యనిర్వహణాధికారి(సీఈఓ)గా  ఓ భారతీయుడు నియమితులయ్యారు. బాటా 126 సంవత్సరాల చరిత్రలో తొలిసారిగా భారతీయుడు గ్లోబల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కావడం విశేషం. ప్రస్తుతం బాటా ఇండియా సీఈఓగా ఉన్న సందీప్ కటారియా ఇప్పుడు పాదరక్షల మేజర్‌లో గ్లోబల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్థాయికి ఎదిగారు. ఇప్పటివరకు గ్లోబల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా దాదాపు ఐదేళ్ల నుండి బాధ్యతలు నిర్వర్తిస్తున్న అలెక్సిస్ నాసార్డ్ పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో సందీప్ కటారియా గ్లోబల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. బాటా సంస్థ ఈ నిర్ణయం తీసుకోవటం ఇదే తొలిసారి.


బాటా గ్లోబెల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమితుడైన తర్వాత కటారియా మాట్లాడుతూ... ‘ఈ కొత్త నియామకంతో నాకు గౌరవం దక్కింది. బాటా అధిక నాణ్యత, సరసమైన పాదరక్షల కోసం ఆశించదగిన ఖ్యాతిని కలిగి ఉన్న బ్రాండ్’ అని పేర్కొన్నారు. సంస్థ లాభదాయకతను పెంచడానికి  నా యశక్తులా పని చేస్తా’నని కటారియా పేర్కొన్నారు. 

Updated Date - 2020-12-01T20:56:46+05:30 IST