ఆంపియర్ నుంచి మరో కొత్త ఈ-బైక్

ABN , First Publish Date - 2020-06-15T22:25:15+05:30 IST

మార్కెట్లోకి మరో సరికొత్త ఈ-బైక్ వచ్చేసింది. గ్రీవ్స్ కాటన్‌కు చెందిన ఆంపియర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈ స్కూటర్‌ను

ఆంపియర్ నుంచి మరో కొత్త ఈ-బైక్

ముంబై: మార్కెట్లోకి మరో సరికొత్త ఈ-బైక్ వచ్చేసింది. గ్రీవ్స్ కాటన్‌కు చెందిన ఆంపియర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈ స్కూటర్‌ను లాంచ్ చేసింది. దీని ఎక్స్ షో రూం ధర రూ.73,990 మాత్రమే.  మాగ్నస్ ప్రో పేరుతో వచ్చిన ఈ బైక్ ప్రస్తుతం బెంగళూరు మార్కెట్లో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇది అందుబాటులోకి రానుంది. కంపెనీ వెబ్‌‌సైట్ ద్వారా దీనిని బుక్ చేసుకోవచ్చని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. 


ఇందులో యాంటీ థెప్ట్ అలారం, డిజిటల్ ఎల్‌సీడీ క్లస్టర్, మొబైల్ చార్జింగ్ పాయింట్,  బ్రైట్ ఎల్ఈడీ లైట్లు, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు ,టెలిస్కోపిక్ సస్పెన్షన్, 450 ఎంఎం లెగ్ స్పేస్,  భారీ స్టోరేజ్ బూట్ స్పేస్, ఒకసారి చార్జింగ్ చేస్తే 75-80 కిలోమీటర్లు ప్రయాణించొచ్చని ఆంపియర్ ఎలక్ట్రిక్ సీఓఓ సంజీవ్ తెలిపారు.  

Updated Date - 2020-06-15T22:25:15+05:30 IST