రూ.25 వేల కోట్లతో 3 అమెజాన్‌ డేటా కేంద్రాలు

ABN , First Publish Date - 2020-02-12T09:35:33+05:30 IST

ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. హైదరాబాద్‌ శివారుల్లో దాదాపు రూ.25 వేల కోట్ల వ్యయంతో మూడు

రూ.25 వేల కోట్లతో 3 అమెజాన్‌ డేటా కేంద్రాలు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. హైదరాబాద్‌ శివారుల్లో దాదాపు రూ.25 వేల కోట్ల వ్యయంతో మూడు భారీ డేటా కేంద్రాలను ఏర్పాటు చేయబోతోంది. ఇందుకు అవసరమైన అనుమతుల కోసం దరఖాస్తులు చేసుకుంది. 90 శాతానికి పైగా పెట్టుబడిని హైఎండ్‌ కంప్యూటర్‌, స్టోరేజీ పరికరాలకు కేటాయించనుంది. హైదరాబాద్‌ శివారులోని చందనవెల్లి, మీర్‌ఖాన్‌పేట, రావిరాలలో సమీపంలోని ఫ్యాబ్‌సిటీల్లో ఈ డేటా కేంద్రాలు ఏర్పాటవుతాయి. ఇందుకోసం ప్రభుత్వం 134 ఎకరాలను అమెజాన్‌కు కేటాయించింది.

మెదటి దశలో రూ.11,600 కోట్లు వరకు పెట్టుబడులను అమెజాన్‌ పెడుతోంది. రాబోయే ఐదేళ్ల కాలంలో ఈ మూడు డేటా కేంద్రాల పూర్తి స్థాయి ఏర్పాటుకు మరో రూ.13,400 కోట్లను వెచ్చించనుంది. ఒక్కో కేంద్రంలో దాదాపు 1500-2000 మందికి చొప్పున ఉపాధి లభించే అవకాశాలున్నాయి. అమెరికా తర్వాత హైదరాబాద్‌లోనే అతిపెద్ద కేంద్రాన్ని అమెజాన్‌ ఏర్పాటు చేస్తుండటం గమనార్హం. కాగా, ప్రస్తుతం అమెజాన్‌కు 22 దేశాల్లో 69 డేటా కేంద్రాలున్నాయి. హైదారాబాద్‌లో మూడు కేంద్రాలు కూడా సిద్ధం అయితే ఆ సంఖ్య 72కు చేరుతుంది. 

Updated Date - 2020-02-12T09:35:33+05:30 IST