అపోలో ఫార్మసీపై అమెజాన్‌ ఆసక్తి!

ABN , First Publish Date - 2020-12-10T06:40:18+05:30 IST

అపోలో హాస్పిటల్స్‌ అనుబంధ అపోలో ఫార్మసీపై అంతర్జాతీయ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. అపోలో ఫార్మసీలో దాదాపు 10

అపోలో ఫార్మసీపై అమెజాన్‌ ఆసక్తి!

బెంగళూరు: అపోలో హాస్పిటల్స్‌ అనుబంధ అపోలో ఫార్మసీపై అంతర్జాతీయ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. అపోలో ఫార్మసీలో దాదాపు 10 కోట్ల డాలర్లు (సుమారు రూ.740 కోట్లు) పెట్టుబడి పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై వ్యాఖ్యానించేందుకు ఇరు వర్గాలు నిరాకరించాయి. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశీయ ఔషధ విక్రయ మార్కెట్లో రిలయన్స్‌, టాటాకు గట్టిపోటీనిచ్చేందుకే అపోలో ఫార్మసీతో జట్టు కట్టేందుకు అమెజాన్‌  ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు.


భారత మార్కెట్లో అమెజాన్‌ ఇప్పటికే ఔషధాల డోర్‌ డెలివరీ సేవలందిస్తోంది. అపోలో ఫార్మసీలో పెట్టుబడుల ద్వారా సంస్థకు చెందిన 3,700 స్టోర్లలోకి అమెజాన్‌కు యాక్సెస్‌ లభిస్తుంది. తద్వారా అమెజాన్‌ తన ఔషధ డెలివరీ సేవలను మరింత విస్తృతం చేసుకునేందుకు అవకాశం లభిస్తుంది. ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఈమధ్యనే ఆన్‌లైన్‌ ఫార్మసీ నెట్‌మెడ్స్‌లో మెజారిటీ వాటా కొనుగోలు చేసింది. 


Updated Date - 2020-12-10T06:40:18+05:30 IST