అమరరాజా లాభం రూ.201 కోట్లు

ABN , First Publish Date - 2020-10-28T08:12:09+05:30 IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి అమరరాజా బ్యాటరీస్‌ లాభం రూ.201.27 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి ఆర్జించిన రూ.218.61 కోట్లతో పోలిస్తే 7.93 శాతం తగ్గింది...

అమరరాజా లాభం రూ.201 కోట్లు

  • ఆదాయం రూ.1,935 కోట్లు 


హైదరాబాద్‌: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి అమరరాజా బ్యాటరీస్‌ లాభం రూ.201.27 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి ఆర్జించిన రూ.218.61 కోట్లతో పోలిస్తే 7.93 శాతం తగ్గింది. గడిచి న మూడు నెలలకు కంపెనీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 14.16 శాతం పెరిగి రూ.1,935.52 కోట్లు, ఖర్చులు 13.11 శాతం పెరిగి రూ.1,676.03 కోట్లుగా నమోదయ్యాయి. అన్ని కీలక రంగాల వ్యాపారాల్లో గిరాకీ పునరుద్ధరణ కంపెనీ పనితీరు మెరుగుపడేందుకు దోహదపడిందని అమరరాజా పేర్కొంది. జూలై-సెప్టెంబరు త్రైమాసికంలో పన్నులు చెల్లించకముందు లాభం (పీబీటీ) రూ.270.77 కోట్లుగా ఉంది. పన్నుల రూపంలో రూ.69.50 కోట్లు చెల్లించడంతో నికర లాభం స్వల్పంగా తగ్గింది. తయారీ యూనిట్లన్నీ 100 శాతం సామర్థ్యం మేరకు పనిచేస్తున్నాయని కంపెనీ సీఈఓ ఎస్‌ విజయానంద్‌ తెలిపారు. మంగళవారం బీఎ్‌సఈలో ట్రేడింగ్‌ ముగిసేసరికి అమరరాజా బ్యాటరీస్‌ షేరు ధర 4.03 శాతం పెరిగి రూ.789.10కి చేరుకుంది. 

నష్టాల్లో సువెన్‌ లైఫ్‌ 

హైదరాబాద్‌: సెప్టెంబరు త్రైమాసికానికి సువెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ రూ.15.65 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. గత ఏడాదిలో ఇదే కాలానికి రూ.19.81 కోట్ల నష్టంతో పోలిస్తే మాత్రం తగ్గింది. గడిచిన మూడు నెలలకు ఈ ఫార్మా కంపె నీ కన్సాలిడేటెడ్‌ నికర విక్రయాలు 550 శాతం వృద్ధి చెంది రూ.8.97 కోట్లుగా నమోదైంది. గత మూడునెలలకు కంపెనీ ఆర్‌ అండ్‌ డీ వ్యయం వార్షిక ప్రాతిపదికన 18.29ు పెరిగి రూ.26.57 కోట్లకు చేరుకోవడం నష్టాలకు కారణమైంది.


Updated Date - 2020-10-28T08:12:09+05:30 IST