‘వైమానిక రంగం కోలుకోవడానికి మరో మూడేళ్లు పట్టొచ్చు’

ABN , First Publish Date - 2020-04-29T03:31:43+05:30 IST

కరోనా మహమ్మారి కారణంగా బాగా దెబ్బతిన్న వైమానిక రంగం కోలుకోవడానికి మరో రెండు-మూడేళ్లు పట్టొచ్చని బోయింగ్ కంపెనీ సీఈవో డేవిడ్ కాల్‌హూన్ చెప్పారు.

‘వైమానిక రంగం కోలుకోవడానికి మరో మూడేళ్లు పట్టొచ్చు’

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా బాగా దెబ్బతిన్న వైమానిక రంగం కోలుకోవడానికి మరో రెండు-మూడేళ్లు పట్టొచ్చని బోయింగ్ కంపెనీ సీఈవో డేవిడ్ కాల్‌హూన్ చెప్పారు. విమాన ప్రయాణాలకు మునపటి డిమాండ్ రావాలంటే సమయం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తమ డివిడెంట్ రేట్లను పునరుద్ధరించడానికి మరో ఐదేళ్ల సమయం పడుతుందని, అలాగే వచ్చే ఆరు నెలల్లో కంపెనీ అప్పులు చేయాల్సి ఉంటుందని చెప్పారు. గతంలో బోయింగ్ సంస్థకు చెందిన రెండు విమానాలు కూలిపోయినప్పటి నుంచి ఈ సంస్థపై తీవ్రమైన ఒత్తిడి నెలకొంది. అదే సమయంలో కరోనా మహమ్మారి రావడంతో పూర్తిగా వైమానిక రంగమే మూతపడాల్సి వచ్చింది.

Updated Date - 2020-04-29T03:31:43+05:30 IST