8375 పైన ముగిస్తే బుల్లిష్.. ఆస్ర్టో గైడ్
ABN , First Publish Date - 2020-04-07T06:05:49+05:30 IST
నిఫ్టీ గత వారం పాయింట్ల 8678-7511 పాయింట్ల మధ్యన కదలాడి 596 పాయింట్ల నష్టంతో 8084 వద్ద నెగిటివ్‌గా ముగిసింది. 20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 9614, 11067, 11575, 11499 వద్ద...

(ఏప్రిల్ 7-9 తేదీల మధ్య వారానికి) గత వారం నిఫ్టీ : 8084 (-596)
- నిఫ్టీ గత వారం పాయింట్ల 8678-7511 పాయింట్ల మధ్యన కదలాడి 596 పాయింట్ల నష్టంతో 8084 వద్ద నెగిటివ్‌గా ముగిసింది.
20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 9614, 11067, 11575, 11499 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా (డెత్‌క్రా్‌స) దిగువకు వచ్చింది. దీర్ఘకాలిక బేరిష్ అయిందనేందుకు ఇది సంకేతం. ఈ వారాంతంలో 9000 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలిక ట్రెండ్ బుల్లిష్ అవుతుంది.
బ్రేకౌట్ స్థాయి: 8375
బ్రేక్‌డౌన్ స్థాయి : 7925
నిరోధ స్థాయిలు:8225, 8300, 8375 (8150 పైన బుల్లిష్)
మద్దతు స్థాయిలు : 8075, 8000, 7925 (8100 దిగువన బేరిష్)
ఇన్వెస్టర్లకు సూచన..
వారం ప్రారంభ స్థాయి అత్యంత కీలకం.
ద్వితీయార్ధం మెరుగు (మంగళవారానికి)
తిథి : చైత్ర శుద్ధ చతుర్దశి నక్షత్రం: హస్త
అప్రమత్తం: పునర్వసు,విశాఖ, పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు, తుల, కుంభ రాశుల వారు అప్రమత్తం.
ట్రెండ్ మార్పు వేళలు : 2.28
ధోరణి : నిఫ్టీ ఫ్యూచర్స్ 9.30 నుంచి 10.15 వరకు నిలకడ/నిస్తేజంగా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత 12.45 వరకు నిస్తేజంగా ఉండి ఆ తర్వాత 2.45 వరకు మెరుగ్గా ట్రేడ య్యే ఆస్కారం ఉంది. తిరిగి చివరిలో నిస్తేజంగా మారవచ్చు.
ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 10.15 సమయానికి ప్రారంభ స్థాయి/సగటు (ఎటిపి) కన్నా దిగువన ట్రేడవుతుంటే తగు స్టాప్‌లా్‌సతో షార్ట్ పొజిషన్లు తీసుకుని 12.45 సమయానికి క్లోజ్ చేసుకోవాలి. ఒంటి గంట తర్వాత ఎటిపి కన్నా పైకి వస్తే లాంగ్ పొజిషన్లు తీసుకుని 3 గంటల సమయంలో క్లోజ్ చేసుకోవలసి ఉంటుంది.
నిరోధం : 8150, 8225, 8300
మద్దతు స్థాయిలు : 8000, 7925, 7850
- డా. భువనగిరి అమరనాథ శాస్త్రి