3వ దశ క్లినికల్‌ పరీక్షల కోసం 8,000 వలంటీర్ల ఎంపిక

ABN , First Publish Date - 2020-12-13T07:21:19+05:30 IST

కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ మూడో దశ క్లినికల్‌ పరీక్షల కోసం అవసరమైన 22,000 మంది వలంటీర్లలో ఇప్పటికే 8,000 మందిని ఎంపిక చేసుకున్నట్లు భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్లా తెలిపారు...

3వ దశ క్లినికల్‌ పరీక్షల కోసం 8,000 వలంటీర్ల ఎంపిక

  • భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్లా 


హైదరాబాద్‌: కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ మూడో దశ క్లినికల్‌ పరీక్షల కోసం అవసరమైన 22,000 మంది వలంటీర్లలో ఇప్పటికే 8,000 మందిని ఎంపిక చేసుకున్నట్లు భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్లా తెలిపారు. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌), నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ)తో కలిసి కంపెనీ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. దేశంలోని 25 కేంద్రాల్లో ఈ వ్యాక్సిన్‌ మూడో దశ క్లినికల్‌ పరీక్షలు జరుగుతున్నాయి. 

Updated Date - 2020-12-13T07:21:19+05:30 IST