కెన్యాలో 5 జీ నెట్వర్క్... ఎయిర్టెల్, నోకియా టై అప్
ABN , First Publish Date - 2020-12-02T00:12:54+05:30 IST
కెన్యాలో హై-స్పీడ్ 4జీ తో నెట్వర్క్ ఆధునీకరణతోపాటు 5జీ ఏర్పాటుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఇందుకు సంబంధించి... ఎయిర్టెల్, నోకియా మధ్య మూడేళ్ల ఒప్పందం కుదిరింది. నైరోబోలో 5జీ నెట్వర్క్ విస్తరణ వచ్చే ఏడాది జూన్‌లో ప్రారంభం కానుంది.

నైరోబీ : కెన్యాలో హై-స్పీడ్ 4జీ తో నెట్వర్క్ ఆధునీకరణతోపాటు 5జీ ఏర్పాటుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఇందుకు సంబంధించి... ఎయిర్టెల్, నోకియా మధ్య మూడేళ్ల ఒప్పందం కుదిరింది. నైరోబోలో 5జీ నెట్వర్క్ విస్తరణ వచ్చే ఏడాది జూన్‌లో ప్రారంభం కానుంది. నైరోబీ సహా కెన్యాలోని పట్టణ, సెమీ అర్బన్, హైవేలు, టూరిస్ట్ స్పాట్స్ సహా మరికొన్ని జిల్లాల్లో ప్రస్తుతమున్న 2జీ, 3జీ, 4జీ రేడియో యాక్సెస్ నెట్వర్క్(రాన్) కవరేజీ అప్‌గ్రేడ్ కానున్నాయి.
నోకియా నెట్వర్క్ మౌలిక సదుపాయాలు ఎయిర్టెల్ కెన్యాకు అవసరమైనప్పుడు 5జీకి సజావుగా మారే అవకాశాన్ని కూడా అందించనున్నాయి. కాగా... అప్‌గ్రేడ్ చేసిన నెట్వర్క్ ఎయిర్టెల్ కెన్యా వినియోగదారులకు మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది ఇక కొత్త, హై-స్పీడ్ డేటా సేవలకు ప్రాప్యతను అందిస్తుంది. ఎయిర్టెల్ కెన్యా సీఈఓ పీడీ శర్మ మాట్లాడుతూ... ‘మా డేటా నెట్వర్క్ ఆధునీకరణతో పాటు కవరేజీని పెంచడానికి మా నెట్‌వర్క్‌ను రూపొందించే పనిలో ఉన్నాం. ఇది మా వినియోగదారులకు మెరుగైన, హై-స్పీడ్ డేటా సేవలను అందించడంలో సహాయపడుతుంది. ఇది వినియోగదారులకు వారి బ్రౌజింగ్ అనుభవాన్ని మరింత పెంచడానికిఅనుమతిస్తుంది. ఈ ప్రాజెక్ట్‌లో నోకియాతో భాగస్వామ్యం కావడాన్ని హర్షిస్తున్నాం. దీని టెక్నాలజీ పోర్ట్‌ఫోలియో మా నెట్వర్క్ నాణ్యతను గణనీయంగా మెరుగుపరుస్తుంది. భవిష్యత్తులో 5 జీ సేవలకు వెళ్లడానికి కూడా అనుమతిస్తుంది’ అని పేర్కొన్నారు.