క్యాప్‌జెమినీలో 30,000 ఉద్యోగాలు

ABN , First Publish Date - 2020-03-02T07:29:46+05:30 IST

ఫ్రెంచ్‌ టెక్నాలజీ దిగ్గజం క్యాప్‌జెమినీ.. ఈ ఏడాదిలో భారత్‌లో 30,000 మంది ఉద్యోగులను నియమించుకోవాలనుకుంటోంది. ప్రస్తుతం దేశీయంగా దాదాపు 1.15 లక్షల మందికి ఈ కంపెనీ ఉపాధి కల్పిస్తోంది. కొత్తగా ఫ్రెషర్లతోపాటు అనుభవం కలిగిన...

క్యాప్‌జెమినీలో 30,000 ఉద్యోగాలు

ముంబై: ఫ్రెంచ్‌ టెక్నాలజీ దిగ్గజం క్యాప్‌జెమినీ.. ఈ ఏడాదిలో భారత్‌లో 30,000 మంది ఉద్యోగులను నియమించుకోవాలనుకుంటోంది. ప్రస్తుతం దేశీయంగా దాదాపు 1.15 లక్షల మందికి ఈ కంపెనీ ఉపాధి కల్పిస్తోంది. కొత్తగా ఫ్రెషర్లతోపాటు అనుభవం కలిగిన ప్రొఫెషనల్స్‌ను నియమించుకోనున్నట్టు కంపెనీ కంట్రీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అశ్విన్‌ యార్డి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగుల్లో సగానికి పైగా భారత్‌లోనే ఉన్నారని ఆయన చెప్పారు. కొత్తగా కంపెనీలో చేరే ఉద్యోగులకు సరిపోయే స్థాయిలో తమ డెవల్‌పమెంట్‌ కేంద్రాలలో ప్రదేశం ఉందన్నారు.


తమ వ్యాపారంలో భారత్‌ చాలా కీలకమైన భాగమని, ఈ ఏడాదిలో ఇక్కడ స్థూలంగా 25,000-30,000 మందిని నియమించుకోనున్నామని ఆయన చెప్పారు. ప్రస్తుతానికి ఉద్యోగులకు భావి టెక్నాలజీలపై నైపుణ్యాలను పెంచడంపై దృష్టిసారిస్తున్నామని తెలిపారు. ఈ ప్రక్రియను నిరంతరం కొనసాగిస్తున్నామన్నారు. తమ ఉద్యోగుల్లో 65 శాతం మంది 30 ఏళ్లకన్నా తక్కువ వయసున్న వారే ఉన్నారని, వీరు కొత్తవి నేర్చుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని  చెప్పారు. 


10-15 ఏళ్ల అనుభవం ఉన్న మధ్యస్థాయిలోని మేనేజర్లకు ప్రత్యేక ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తున్నామని తెలిపారు. వీరికి ప్రాజెక్టు మేనేజర్లు లేదా ఆర్కిటెక్ట్స్‌ హోదాలను కట్టబెట్టనున్నామని చెప్పారు. తక్షణ ప్రాతిపాదికన ఉద్యోగులు ప్రాజెక్టులో చేరాలని క్లయింట్లనుంచి డిమాండ్‌ పెరుగుతోందన్నారు. కొన్ని టెక్నాలజీ కంపెనీలు స్టార్ట్‌ప్సలో పెట్టుబడులు పెడుతున్నాయి. కానీ ఇందుకు భిన్నంగా క్యాప్‌జెమినీ 150కి పైగా స్టార్ట్‌ప్సతో క్రిటికల్‌ టెక్నాలజీలపై కలిసి పని చేస్తోంది.

Updated Date - 2020-03-02T07:29:46+05:30 IST