29 లక్షల ఉద్యోగాలకు ముప్పు!
ABN , First Publish Date - 2020-04-25T06:48:14+05:30 IST
కరోనా వైరస్ దెబ్బకు విమాన రంగం విలవిలలాడుతోంది. ప్రస్తుత సంక్షోభంతో భారత విమానయానం, దాని ఆధారిత రంగాల్లో (ట్రావెల్ అండ్ టూరిజం)ని 29 లక్షలకు పైగా ఉద్యోగాలకు ముప్పు

భారత విమానయాన రంగ సంక్షోభంపై ఐఏటీఏ
న్యూఢిల్లీ: కరోనా వైరస్ దెబ్బకు విమాన రంగం విలవిలలాడుతోంది. ప్రస్తుత సంక్షోభంతో భారత విమానయానం, దాని ఆధారిత రంగాల్లో (ట్రావెల్ అండ్ టూరిజం)ని 29 లక్షలకు పైగా ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) అంటోంది. ఎందుకంటే, విమాన రంగంలోని ఒక్కో ఉద్యోగం.. ట్రావెల్, టూరిజం రంగాల్లో 24 మంది ఉపాధికి మద్దతిస్తుంది. లాక్‌డౌన్ కారణంగా భారత మార్గాల్లో సేవలందించే ఎయిర్‌లైన్స్ ఆదాయానికి 1,122 కోట్ల డాలర్ల (రూ.85,000 కోట్లు) పైగా గండిపడవచ్చని ఐఏటీఏ అంచనా. అంతేకాదు, ఈ ఏడాది భారత విమాన ప్రయాణికుల రద్దీ 47 శాతం తగ్గవచ్చంటోంది. లాక్‌డౌన్‌తో విమానయానం, పర్యాటక రంగాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని ఈ అసోసియేషన్ పేర్కొంది. భారత్‌లో లాక్‌డౌన్‌కు ముందే అంతర్జాతీయ విమాన సర్వీసుల రాకపోకలు నిలిచిపోయాయి. లాక్‌డౌన్‌తో దేశీయ సర్వీసులూ స్తంభించిపోయాయి.