మహీంద్ర స్కార్పియో బీఎస్6 బుకింగ్స్ షురూ!

ABN , First Publish Date - 2020-04-27T00:16:42+05:30 IST

మహీంద్ర స్కార్పియో బీఎస్6 బుకింగ్స్ షురూ!

మహీంద్ర స్కార్పియో బీఎస్6 బుకింగ్స్ షురూ!

న్యూఢిల్లీ: ఇండియన్ ఎస్‌యూవీ మాన్యుఫ్యాక్చరర్ మహీంద్ర అండ్ మహీంద్ర తన లేటెస్ట్ 2020 మహీంద్ర స్కార్పియో బీఎస్6 వెర్షన్‌కు అధికారికంగా ఆన్‌లైన్ బుకింగ్స్ ప్రారంభించింది. టోకెన్ అమౌంట్‌గా రూ. 5 వేలు నిర్ణయించింది. స్కార్పియో బీఎస్6‌తోపాటు మహీంద్ర ఎక్స్‌యూవీ 500, బొలేరొ, కేయూవీ100 ఎన్ఎక్స్‌టీ, ఎక్స్‌యూవీ300తోపాటు ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ అయిన అల్టురస్ జీ4లకు కూడా ఆన్‌లైన్ బుకింగ్స్ స్వీకరిస్తోంది. అయితే, బీఎస్6 స్కార్పియో ధరను మాత్రం వెల్లడించలేదు. ఇందులో నాలుగు వేరియంట్లు ఉన్నాయి. అవి ఎస్5, ఎస్7, ఎస్9, ఎస్11. 


అలాగే, బాడీ-హగ్గింగ్ బంపర్స్, ఫాగ్ లాంప్ గార్నిష్ సెట్, డెకాల్స్, పార్కింగ్ కవర్, అలాయ్ వీల్స్, హెడ్‌రెస్ట్-మౌంటెడ్ డీవీడీ టచ్‌స్క్రీన్, స్కఫ్ వంటి ఉపకరణాలతో పాటు ఎస్‌యూవీని ప్రీ బుకింగ్ చేసుకునే ఆప్షన్ కూడా అందిస్తోంది. 

అయితే, బీఎస్6 మహీంద్ర స్కార్పియో బీఎస్6పై కాస్మెటిక్ అప్‌డేట్స్ లేవు. అంతేకాదు, మెకానికల్ ఫ్రంట్‌కు మాత్రమే మార్పులు పరిమితమయ్యాయి. కొత్త స్కార్పియోలో క్రోమ్ ఇన్సర్ట్‌లతో గంభీరమైన ఫ్రంట్ గిల్, 17-అంగుళాల మస్కులర్ అలాయ్ వీల్స్, సైడ్ టర్న్ ఇండికేటర్లతో ఓఆర్‌వీఎంలు, క్రోమ్ అప్లిక్‌తో రీడిజైన్డ్ చేసిన టెయిల్‌గేట్, సొగసైన రెడ్‌లెన్స్ ఎల్‌ఈడీ టెయిల్ లైట్స్‌తోపాటు మరెన్నో ఉన్నాయి. డైమెన్షనల్ ప్రకారం చూస్తే.. ఎస్‌యూవీ పొడవు 4,456 మిల్లీమీటర్లు కాగా,  వెడల్పు 1,820 మిల్లీమీటర్లు. ఎత్తు 1,995 మిల్లీమీటర్లతోపాటు వీల్‌బేస్ 2,680 మిల్లీమీటర్లుగా ఉంది.

Updated Date - 2020-04-27T00:16:42+05:30 IST