20 ఏళ్లలో.. 1,880 కొత్త విమానాలు
ABN , First Publish Date - 2020-03-13T07:50:50+05:30 IST
వచ్చే ఇరవై ఏళ్లలో భారత్‌లో విమాన ప్రయాణికుల రద్దీ ఏడాదికి 7.7 శాతం చొప్పున వృద్ధి చెందగలదని ఎయిర్‌బస్ అంచనా వేస్తోంది. ఇది అంతర్జాతీయ సగటు 4.3 శాతం కన్నా...

భారత్‌పై ఎయిర్‌బస్ అంచనా
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): వచ్చే ఇరవై ఏళ్లలో భారత్‌లో విమాన ప్రయాణికుల రద్దీ ఏడాదికి 7.7 శాతం చొప్పున వృద్ధి చెందగలదని ఎయిర్‌బస్ అంచనా వేస్తోంది. ఇది అంతర్జాతీయ సగటు 4.3 శాతం కన్నా దాదాపు రెట్టింపు. దేశీయ విమాన ప్రయాణికులు సగటున ఏడాదికి 8.2 శాతం మేరకు పెరగనున్నారని.. విదేశాల నుంచి వచ్చి పోయే విమా న ప్రయాణికులు వృద్ధి రేటు ప్రస్తుతం 3-4 శాతం ఉండగా.. 2038 నాటికి ప్రతి ఏడాది 5-7 శాతం మేరకు పెరగొచ్చని ఎయిర్‌బస్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, ప్రెసిడెంట్ అనంద్ స్టాన్లీ తెలిపారు. ప్రస్తు తం 54 కోట్లుగా ఉన్న మధ్య తరగతి వర్గం 2038 నాటికి 100 కోట్లకు చేరగలదని ‘వింగ్స్ ఇండియా’లో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు.
‘బలమైన ఆర్థిక వృద్ధి రేటు, మధ్య తరగతి వర్గం విమాన ప్రయాణికుల వృద్ధికి దోహదం చేయనుంది. ప్రస్తుతం మధ్యతరగతిలో 10 శాతం మంది మాత్రమే విమాన ప్రయాణం చేస్తున్నారు. ఇది ఏ మాత్రం పెరిగినా విమానయాన రంగానికి మేలు చేస్తుంది. 2038 నాటి కి మొత్తం భారత జనాభాలో మధ్య తరగతి వర్గం 63 శాతానికి చేరగలదని అంచనా. 2018 నుంచి 2038 మధ్య ఇరవై ఏళ్లలో భారత్‌కు 1,880 కొత్త ప్యాసింజర్, కార్గో విమానాలు అవసరమవుతాయని ఎయిర్‌బస్ పేర్కొంది. ఇందులో 20 శాతం వరకూ వైడ్ బాడీ విమానాలు ఉంటాయి. కొత్తగా అవసరమయ్యే విమానాల్లో 440 విమానాలను ఉన్న విమానాలను రీప్లేస్ చేయడానికి కాగా మిగిలిన 1,440 విమానాలు డిమాండ్‌కు అనుగుణంగా సేవలు అందించడానికని స్టాన్లీ వివరించారు.
హైదరాబాద్‌లో మరిన్ని కార్యకలాపాలు
ఇటీవలే హైదరాబాద్‌లో ఇంజినీరింగ్, పరిశోధన కార్యకలాపాలను ఎయిర్‌బస్ ప్రారంభించింది. ఇక్క డ కంపెనీకి 150 మంది ఇంజనీర్లు ఉన్నారు. హైదరాబాద్ కార్యకలాపాలను భారీగా విస్తరించనున్నామని స్టాన్లీ తెలిపారు. ఇన్ఫోసి్‌సతో కలిసి ఇంజినీరింగ్, డిజైనింగ్, టాటాలతో కలిసి తయారీ కార్యకలాపాలను కంపెనీ నిర్వహిస్తోంది. స్టార్ట్‌పలు, హెలీ అంబులెన్స్ వంటి అర్బన్ మొబిలిటీ, తదితర విభాగాల్లో కార్యకలాపాలు చేపట్టడానికి తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు.