ఏపీకి రూ.1,055 కోట్లు, తెలంగాణకు రూ.599 కోట్లు
ABN , First Publish Date - 2020-12-15T06:47:26+05:30 IST
జీఎ్‌సటీ లోటును భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏడో విడత కింద రూ.6,000 కోట్లు విడుదల చేసింది.

జీఎ్‌సటీ లోటు భర్తీ నిధులు విడుదల చేసిన కేంద్రం
న్యూఢిల్లీ (ఆంధ్రజ్యోతి): జీఎ్‌సటీ లోటును భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏడో విడత కింద రూ.6,000 కోట్లు విడుదల చేసింది. మొత్తం 23 రాష్ర్టాలకు రూ.5,516.60 కోట్లు, కేంద్ర పాలిత ప్రాంతాలైన ఢిల్లీ, జమ్ము కశ్మీర్, పుదుచ్చేరిలకు రూ.483.40 కోట్లు విడుదల చేసినట్లు సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా ఈ నిధుల్లో ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,055.79 కోట్లు, తెలంగాణకు రూ.559.02 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొంది.