-
-
Home » Andhra Pradesh » yv subbareddy VELIGONDA project
-
త్వరలోనే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తాం: వైవీ సుబ్బారెడ్డి
ABN , First Publish Date - 2020-12-06T21:03:20+05:30 IST
ఆరు నెలల్లోపే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు.

ప్రకాశం: ఆరు నెలల్లోపే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ అధికారంలోకి వస్తే ఏడాది లోపు వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పామని దానికి కట్టుబడి ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు కేటాయించామని వ్యాఖ్యానించారు. కరోనా కారణంగా పనులు నిలిచిపోయాయని త్వరలోనే ప్రాజెక్టు పనులు పూర్తి అవుతాయని చెప్పారు. టీడీపీ చేస్తున్న విమర్శలు పట్టించుకోవద్దని అన్నారు.