సైరా పంచ్‌కు బుద్దా అదిరిపోయే కౌంటర్
ABN , First Publish Date - 2020-07-10T18:21:31+05:30 IST
వైసీపీ, టీడీపీ నేతల మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతూనే ఉంది. నెటిజన్లను ఎంటర్టైన్ చేస్తూ...

ఇంటర్నెట్: వైసీపీ, టీడీపీ నేతల మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతూనే ఉంది. నెటిజన్లను ఎంటర్టైన్ చేస్తూ... సరదా సరదా పంచులతో ఇరు పార్టీల నేతలు సందడి చేస్తున్నారు. తాజాగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్వీట్‌కు టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. వైఎస్ జగన్ సీఎంగా ఏడాది పాలనపై ట్వీట్ చేస్తూ ఇది ట్రైలర్ మాత్రమేనని విజయసాయి అన్నారు. దీనిపై స్పందించిన బుద్దా.. ‘‘నిజమే ట్రైలర్‌కే ఎంపీలు జంప్, మంత్రుల అసంతృప్తి, ఎమ్మెల్యేలు ధర్నాలు, నిరసనలు. ఇక అసలు బొమ్మ పడితే యుశ్రారైకాపా ఖాళీ. మామా, అల్లుడికి చంచల్ గూడా జైలులో చిప్పకూడు ఖాయం’’ అని వ్యాఖ్యానించారు.