పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి షాక్!

ABN , First Publish Date - 2020-03-12T18:01:13+05:30 IST

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీకి భారీ షాక్..

పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి షాక్!

ఏలూరు : స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గత పది సంవత్సరాలుగా పార్టీకి సేవలందించిన బొద్దాని శ్రీనివాస్‌ని వైసీపీ పక్కనపెట్టింది. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తికి లోనవుతూ.. మంత్రి ఆళ్లనాని ఇంటి ముందు బైఠాయించారు. దీంతో మంత్రి ఇంటి వద్ద పరిస్థితి ఆందోళనకరంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. 


అసలేం జరిగింది..!?

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన శ్రీనివాస్.. టీడీపీ నుంచి వైసీపీలో ఇటీవే చేరిన మాజీ మేయర్ నూర్జహాన్‌కు ఏలూరు మేయర్‌గా ప్రకటించడం బాధగా ఉందన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి సేవలందించిన తనకు న్యాయం జరిగే వరకూ ఇక్కడ్నుంచి కదిలేదే లేదంటూ మంత్రి ఇంటి ముందు బైఠాయించారు. తాను  ఏలూరు మేయర్ పదవిని ఆశించిన మాట వాస్తవమేనన్నారు. గతంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని కూడా వదులుకున్నానని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.


అయితే.. ఆయన పార్టీకి రాజీనామా చేసే అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తున్నాయి. కాగా.. ఆయన్ను బుజ్జగించడానికి మంత్రి, స్థానిక నేతలు రంగంలోకి దిగారు. అయితే శ్రీనివాస్‌ను ఒకసారి అదుపులోకి తీసుకున్న పోలీసులు వదిలేసినట్లు తెలుస్తోంది. కాగా ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

Updated Date - 2020-03-12T18:01:13+05:30 IST