బాలుగారి మరణం నన్ను కలవరపరిచింది : వైసీపీ ఎంపీ

ABN , First Publish Date - 2020-09-25T23:18:31+05:30 IST

లెజండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణం తనను కలవరపరిచిందని వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ వ్యాఖ్యానించారు.

బాలుగారి మరణం నన్ను కలవరపరిచింది : వైసీపీ ఎంపీ

అమరావతి : లెజండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణం తనను కలవరపరిచిందని వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ వ్యాఖ్యానించారు. శుక్రవారం సాయంత్రం బాలు మరణంపై ఓ ప్రకటనను ఆయన విడుదల చేశారు. సినీసంగీత ప్రపంచంలో మహా వృక్షము మరణ వార్త నన్ను కలవరపరచింది. 40 వేల పాటలు పైగా పాడారు, 100 సినిమాలకు డబ్బింగ్ చేశారు. ఎస్పీబీ మరణం యావత్ సంగీత రంగాన్ని ఎంతో కలవరపరిచింది. నాకైతే సొంత కుటుంబ సభ్యులను కోల్పోయినట్లు ఉన్నది. ఎస్పీ గారు నాకు మంచి అప్తుడు. వారి అమృత గానంతో ఎంతో మంది కళాకారులను తయారు చేయడం జరిగిందని తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలియచేస్తున్నానుఅని మోపిదేవి ప్రకటనలో తెలుపుతూ బావోద్వేగానికి లోనయ్యారు. కాగా.. గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం మృతిపట్ల పలువురు రాజకీయ, సీనీ ప్రముఖులు కన్నీళ్లతో నివాళులు అర్పిస్తున్నారు.

Updated Date - 2020-09-25T23:18:31+05:30 IST