నేను అసంతృప్తిగా లేను.. జగన్ స్పందించారు : వైసీపీ ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2020-06-07T01:28:06+05:30 IST

సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించి కీలక నిర్ణయాలే తీసుకున్నారు.

నేను అసంతృప్తిగా లేను.. జగన్ స్పందించారు : వైసీపీ ఎమ్మెల్యే

రాజమండ్రి : ఇసుక వ్యవహారంపై కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీలో కలకలం రేపిన విషయం విదితమే. అయితే ఈ ఇసుక విషయమై పలువురు వైసీపీ నేతలే పెదవి విప్పడంతో ఎట్టకేలకు శుక్రవారం నాడు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించి కీలక నిర్ణయాలే తీసుకున్నారు. తాజాగా ఈ విషయమై ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మీడియా మీట్ నిర్వహించారు. జగన్ పాలనలో సమస్యలపై మాట్లాడే స్వేచ్ఛ ఎమ్మెల్యేలకు ఉందన్నారు. 


అసంతృప్తిగా లేను..!

అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో సమస్యలపై గట్టిగా మాట్లాడానని చెప్పారు. ఈ విషయాలన్నీ మంత్రి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని చెప్పానన్నారు. తాను పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్నట్టు మీడియా వక్రికరించిందని.. అదంతా అబద్ధమేనని వ్యాఖ్యానించారు. వైసీపీ ఎమ్మెల్యే‌ల్లో ఎవరికీ అధిష్టానం పట్ల అసంతృప్తి లేదన్నారు. సమస్యలపై చర్చించే స్వేచ్ఛను ముఖ్యమంత్రి జగన్.. ఎమ్మెల్యేలకు ఇచ్చారని జగ్గిరెడ్డి చెప్పుకొచ్చారు. ఇసకు విధానంపై తాను చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి జగన్ వెంటనే స్పందించారని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు.


నిన్న జగ్గిరెడ్డి అసలేమన్నారు!?

ఇసుక సరఫరాలో ఏపీఎండీసీ విఫలమైంది. కోనసీమలో ఇసుక ఉన్నా ఇంటి నిర్మాణానికి దొరకడం లేదు. కోనసీమలో 10 ఇసుక ర్యాంపులు ఉన్నా ఒక్కదాన్నీ ప్రారంభించలేదు. ఏపీఎండీసీపై మంత్రి రామచంద్రారెడ్డికి ఫిర్యాదు చేశాను. బ్రిక్‌ ఇండస్ట్రీ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.8 లక్షల సబ్సిడీ ఇస్తుంటే నిబంధనల పేరుతో అధికారులు వారిని వేధిస్తున్నారు. పంట పొలాల్లో మట్టిని తరలించడం రైతుల హక్కు.. రైతులపై కేసు పెట్టాలనుకుంటే ముందుగా నాపై పెట్టండిఅని జగ్గిరెడ్డి వ్యాఖ్యానించారు.

Updated Date - 2020-06-07T01:28:06+05:30 IST