రైతులకు నష్టం లేకుండా బీమా సొమ్మూ అందించాలన్నదే లక్ష్యం: జగన్‌

ABN , First Publish Date - 2020-12-15T19:36:52+05:30 IST

నష్టపోయిన రైతులకు బీమా అందించే ఉద్దేశంతో వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకాన్ని..

రైతులకు నష్టం లేకుండా బీమా సొమ్మూ అందించాలన్నదే లక్ష్యం: జగన్‌

అమరావతి: నష్టపోయిన రైతులకు బీమా అందించే ఉద్దేశంతో వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకాన్ని మంగళవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు నష్టం లేకుండా బీమా సొమ్మూ అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రైతుల ప్రీమియం వాటా రూ.465 కోట్లు ప్రభుత్వమే కట్టిందని, ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 9.48 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు.


రైతులకు రూ.1,252 కోట్ల బీమా పరిహారం చెల్లించామని సీఎం జగన్ తెలిపారు. 2019 సీజన్‌లో పంట నష్టపోయిన రైతులకు బీమా పరిహారం రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బుల జమ చేసినట్లు చెప్పారు. పంటనష్టం జరిగితే బీమా సొమ్మూ వస్తుందనే నమ్మకం రైతుల్లో కలగాలన్నారు. గతంలో రైతులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రీమియం కట్టేవని, ఇప్పుడు రైతుల తరపున ప్రభుత్వమే ఇన్సూరెన్స్‌ కడుతోందని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

Updated Date - 2020-12-15T19:36:52+05:30 IST