ఏపీలో వైఎస్సార్ బీమా పథకం ప్రారంభం
ABN , First Publish Date - 2020-10-21T18:12:36+05:30 IST
అమరావతి: ఏపీలో వైఎస్సార్ బీమా పథకం ప్రారంభమైంది. క్యాంప్ కార్యాలయంలో పథకాన్ని

అమరావతి: ఏపీలో వైఎస్సార్ బీమా పథకం ప్రారంభమైంది. క్యాంప్ కార్యాలయంలో పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. 18-50 ఏళ్ల మధ్య వారు మరణిస్తే నామినీకి రూ.5 లక్షల బీమా వర్తించనుంది. 51-70 ఏళ్ల మధ్య లబ్ధిదారుడు మరణిస్తే రూ.3 లక్షల పరిహారం లభించనుంది. లబ్ధిదారుడు సహజ మరణం పొందితే రూ.2 లక్షల పరిహారం అందనుంది. ప్రమాదంలో చనిపోతే రూ.5 లక్షల బీమా వర్తించనుంది. శాశ్వత అంగవైకల్యానికి రూ.5లక్షలు, పాక్షిక అంగవైకల్యానికి రూ.1.50 లక్షల బీమా వర్తించనుంది. లబ్ధిదారుల తనఫున పూర్తి ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించనుంది. ఈ పథకానికి ప్రభుత్వం రూ.510 కోట్లకు పైగా నిధులను కేటాయించింది.