వైఎస్‌ఆర్‌ బీమాను కొత్త పథకంలా హడావిడి చేస్తున్నారు: అచ్చెన్న

ABN , First Publish Date - 2020-10-22T00:06:42+05:30 IST

వైఎస్‌ఆర్‌ బీమాను కొత్త పథకంలా హడావిడి చేస్తున్నారు: అచ్చెన్న

వైఎస్‌ఆర్‌ బీమాను కొత్త పథకంలా హడావిడి చేస్తున్నారు: అచ్చెన్న

అమరావతి: వైఎస్‌ఆర్‌ బీమాను కొత్త పథకంలా హడావిడి చేస్తున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తప్పుబట్టారు. పాత పథకాలకు పేరు మార్చడం తప్ప వైసీపీ ప్రభుత్వం చేసింది ఏమీలేదని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వంలో చంద్రన్న బీమా రెండున్న కోట్ల మందికి ఇచ్చామని తెలిపారు. అనేక ఆంక్షలతో వైఎస్‌ఆర్‌ బీమా లబ్దిదారులను తగ్గించారని అచ్చెన్నాయుడు విమర్శించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు నియమితులైన విషయం తెలిసిందే. అచ్చెన్నాయుడి  నియామకాన్ని ఆ పార్టీ వర్గాలు చాలా కాలం నుంచే ఊహిస్తున్నాయి. ప్రభుత్వం నమోదు చేసిన కేసుతో కొంత కాలం జైలులో ఉండాల్సి రావడంతో పార్టీ వర్గాల్లో అచ్చెన్నాయుడి పట్ల మొగ్గు మరింత పెరిగింది.

Updated Date - 2020-10-22T00:06:42+05:30 IST